గ్యాస్ సిలిండర్ ధరలు అమాంతం పెంచడం పట్ల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర ఎకంగా రూ.102 పెంచి సామాన్య ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నారని ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. ప్రధాని మోదీ ప్రభుత్వ చర్యలు, నిర్ణయాలు ప్రజా జీవితాలను మరింత కష్టాల్లోకి నెట్టుతున్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వం సామాన్య ప్రజల ఆవేదనను అర్థం చేసుకోవాలన్నారు. ప్రజలు దుకాణాలకు సైతం వెళ్లేందుకు భయపడేలా నిత్యావసరాల ధరలు పెంచుతున్నదని కవిత మండిపడ్డారు.
కేంద్రం చర్యలతో ప్రజలకు కష్టాలు.. గ్యాస్ ధర పెంపుపై ఎమ్మెల్సీ కవిత ఫైర్
Advertisement
తాజా వార్తలు
Advertisement