Friday, November 22, 2024

వాయబ్బో, ఆ సర్పంచ్‌ మాకొద్దు.. ఎల్లంపేట గ్రామస్తుల తీర్మానం..

మేడ్చల్‌ (ప్రభన్యూస్‌) : అవినితి అక్రమాలను పాల్పడిన ఆ సర్పంచ్‌ మేకల రామకృష్ణుడు అంటే ఆ గ్రామస్తులు భగ్గున మండిపడుతున్నారు. తను సర్పంచుగా అస్సలు వద్దని గ్రామసభలో ఏకగ్రీవ తీర్మానం చేశారు. మేడ్చల్​ మండలంలోని ఎళ్లంపేట సర్పంచ్‌ రామకృష్ణుడు గతంలో గ్రామ పంచాయతీ నుండి డిజిల్‌ కోసం తప్పుడు బిల్లులు సృష్టించి నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని అందుకే తొలగించినట్టు చెబుతున్నారు.

అంతేకాకుండా ఎల్లంపేటలో గ్రామ కుంటం స్థలాలకు అమాయక ప్రజల నుండి లక్షల్లో దండుకుని రిజిస్ట్రేషన్‌ చేయించారని ఆరోపిస్తున్నారు. గ్రామాభివృద్దిని విస్మరించి ధనార్జనే ధ్యేయంగా అక్రమాలకు పాల్పడిన సర్పంచ్‌ రామకృష్ణుడు ఎప్పటికి తమకొద్దని చెబుతున్నారు. అంతేకాకుండా గ్రామ కంఠం భూములకు తీసుకున్న డబ్బులు వెంటనే తిరిగి చెల్లించాలని, లేకుంటే అతని ఇంటి ముందు పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement