Friday, November 22, 2024

Thanks to all – అభిమానుల ఆద‌ర‌ణ తోనే ఈ ప‌ద్మ‌విభూష‌ణ్ పుర‌స్కారం – చిరంజీవి

హైద‌రాబాద్ – ఈ ఏడాది రిపబ్లిక్ డే తనకెంతో ప్రత్యేకమని.. ఈ ప్రయాణంలో తనలో స్పూర్తి నింపి ముందుకు నడిపించింది అభిమానులే అన్నారు మెగాస్టార్ చిరంజీవి. హైద‌రాబాద్ లోని చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌లో జరిగిన రిపబ్లిక్ డే వేడుకల్లో కుటుంబంతో కలిసి పాల్గొన్నారు . ముందుగా ఆయ‌న జాతీయ ప‌త‌కాన్ని ఆవిష్క‌రించి గౌర‌వ వంద‌నం చేశారు.. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ, ఎంతో మంది మహానుభావులు వారి జీవితాలను త్యాగం చేసి మనకు స్వేచ్చను అందించారని.. వారి త్యాగఫలమే ఈ స్వేచ్ఛ అని అన్నారు. తన 45 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంలో సినీ కళామతల్లికి సేవ చేసుకున్నానని.. ఎప్పుడూ కళాకారులకు అండగా నిలబడ్డానని.. అందులోనే ఈ బ్లడ్ బ్యాంక్ స్టార్ట్ చేశామని అన్నారు. ఇది ఎందరికో స్ఫూర్తిగా నిలిచిందని తెలిపారు.

పాతికేళ్ల ముందు రక్తం కొరతతో ప్రాణాలను కోల్పోతున్నారు అనే మాట నుంచి ఇప్పుడు అలాంటి ప్రస్తావన రాలేదంటే తాను తీసుకున్న నిర్ణయం పట్ల గర్వపడుతున్నానని అన్నారు. బ్లడ్ బ్యాంక్ ఇంతగా సక్సెస్ కావడానికి తన అభిమానులే అని.. వారికి ఎప్పటికీ రుణపడి ఉంటానని అన్నారు చిరు. తాను చేసిన సేవలను గుర్తించి 2006లో పద్మ భూషణ్ అవార్డునిచ్చారని..కానీ ఇప్పుడు పద్మవిభూషణ్ అవార్డును ప్రకటించడం అసలు ఊహించలేదని అన్నారు. కేంద్రప్రభుత్వం ఈ పురస్కారం అందించడం ఎంతో సంతోషంగా ఉందని. అందుకు కారణమైన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు చిరు. ఈ కార్య‌క్ర‌మంలో నిర్మాత అల్లు అరవింద్, హీరో వరుణ్ తేజ్, సుష్మిత కొణిదెల, చిరంజీవి మనవరాళ్లు నవిష్క, సమరలతో పాటు అభిమానులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement