కరీంనగర్ . క్రైమ్ ఆంధ్రప్రభ తనను హైదరాబాదులో అరెస్టు చేసినప్పటి నుండి బెయిల్ పై విడుదల అయ్యే వరకు మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికి చేతులు జోడించి ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు హుజరాబాద్ ఎమ్మెల్యే పేర్కొన్నారు.
బెయిల్ పై విడుదల అయిన అనంతరం ఆర్ అండ్ బి అతిథి గృహంలో మాట్లాడుతూ కష్టకాలంలో తనకు మొదటి ఇచ్చిన పార్టీ అధ్యక్షులు కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావు, కవిత లతోపాటు బారాస ప్రజాప్రతినిధులకు, 60 లక్షల మంది గులాబీ సైనికులకు కృతజ్ఞతలు తెలియజేశారు.
కోర్టు ను గౌరవించి రాజకీయాలు మాట్లాడటం లేదని, కరీంనగర్ లో ఎలాంటి రాజకీయాలు మాట్లాడొద్దని న్యాయస్థానం ఆదేశాల మేరకు బుధవారం హైదరాబాద్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి పూర్తి వివరాలు వెల్లడిస్తానన్నారు. అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి మిత్రులకు కృతజ్ఞతలు తెలియజేశారు