సిద్దిపేట – ఈ ఎన్నికల్లో మొత్తంలో మనకు 1.8శాతం మాత్రమే ఓట్లు తక్కువగా వచ్చాయని,. మనల్ని ప్రజలు పూర్తిగా తిరస్కరించాలేదని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ప్రజలు మనల్ని నమ్మబంటే 39 స్థానాలు గెలుచుకున్నామని అన్నారు. సిద్దిపేట జిల్లాలో బీఆర్ఎస్ కృతజ్ఞత సభలో మాట్లాడుతూ.. రాష్ట్రంలో 4 లక్షల ఓట్లు వచ్చి ఉంటే ప్రభుత్వం మనదే ఉండేదని చెప్పారు. చరిత్రలో దక్షిణ భారత దేశంలో మూడోసారి ఏ ప్రభుత్వం రాలేదన్నారు. మన పార్టీకి దళిత బంధు, బీసీ బందుతో పాటు గృహ లక్ష్మి పథకాలు ఇబ్బంది పెట్టాయని కార్యకర్తలు చెప్పారన్నారు. మన పథకాలు ప్రచారం చేయడంలో విపలమయ్యామని అన్నారు. కాంగ్రెస్ పార్టీ తీరు ఆనాడు ప్రచారంలో అబద్ధాలు నేడు పాలనలో అసహనం ఉందని అన్నారు.
నాడు దావొస్ పర్యటన దండగా అన్నారు నేడు ముఖ్యమంత్రి ముందుగా ఎందుకు వెళ్ళారని ప్రశ్నించారు. . యుట్యూబ్ ఛానెల్ ప్రభావం మనపై పడిందని అన్నారు. అధికారంలోకి వచ్చిన మర్నాడే రెండు లక్షల రుణమాఫి చేస్తామని హామీ ఇచ్చారని అన్నారు. నేటికీ కూడా రుణమాఫి ఉసే లేదని మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వేస్తే రైతుబందు డబ్బులను 15వేలకు పెంచుతామని చెప్పి ఎన్నికల ముందు డబ్బులు పడకుండా ఆపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి రైతుబందు డబ్బులు పడలేదు అన్నోల్లను చెప్పుతో కొట్టుమని అన్నారని అంటూ . ఇదేం పద్దతి అని నిలదీశారు. కాంగ్రెస్ నాయకులు అహంకారంతో మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
వరల్డ్ ఎలక్ట్రీషియన్ డే ..
వరల్డ్ ఎలక్ట్రీషియన్ డే సందర్భంగా సిద్దిపేటలో ప్రైవేట్ ఎలక్ట్రీషియన్స్ అసోసియేషన్ నిర్వహించిన కార్యక్రమంలో జెండాను ఆవిష్కరించారు హరీష్ రావు. థామస్ ఆల్వా ఎడిసన్ కరెంటు బల్బును ఆవిష్కరించిన రోజుకు గుర్తుగా ఎలక్ట్రీషియన్ డే జరుపుకుంటున్నామన్నారు. సిద్దిపేటలో ప్రైవేట్ ఎలక్ట్రీషియన్స్ అసోసియేషన్ ఏర్పాటు కావడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు.. అసోసియేషన్ భవన నిర్మాణానికి స్థలం, నిధులు అందజేశామని గుర్తు చేశారు.. ఎలక్ట్రీషియన్లకు ప్రమాద బీమా కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతామన్నారు.