Sunday, November 17, 2024

Thanks Meet – ఎల్బీ స్టేడియం రేవంత్ కు ఉపాధ్యాయుల కృత‌జ్ఞ‌త స‌భ‌…!

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్ – హైద‌రాబాద్ – కాంగ్రెస్ ప్రభుత్వం తాజాగా ఏళ్ల తరబడి పదోన్నతులు లభించని ఉపాధ్యాయులకు వివిధ కేటగిరీల వారీగా పదోన్నతులు కల్పించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా పదోన్నతి పొందిన సుమారు 30 వేల మంది టీచర్లతో సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు.
మధ్యాహ్నం మూడు గంటలకు ఎల్బి స్టేడియంలో ఇటీవల పదోన్నతి పొందిన ప్రభుత్వ ఉద్యోగులతో సీఎం ముఖాముఖి కార్యక్రమం నిర్వహించనున్నారు.

ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఎల్బీ స్టేడియంలో జరిగే భారీ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ఈ మేరకు ఆయా జిల్లాల కలెక్టర్లు ఇప్పటికే విద్యాశాఖ అధికారులు, ఎంఈవోలు, మండల నోడల్ అధికారులకు ఆదేశాలు ఇచ్చి పదోన్నతి పొందిన ఉపాధ్యాయులను ప్రత్యేక బస్సులు పెట్టి హైదరాబాద్ ఎల్బీ స్టేడియం కు తరలిస్తున్నారు.

ట్రాఫిక్ ఆంక్షలు

- Advertisement -

నేడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలోనూ ఉపాధ్యాయుల సంఖ్యను బట్టి జిల్లాల వారీగా ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసి తరలింపు ప్రక్రియ నిర్వహిస్తున్నారు. ఇలా ఉంటే నేడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎల్వి స్టేడియంలో నిర్వహించనున్న సభ నేపథ్యంలో హైదరాబాద్లో ఎల్బీ స్టేడియం పరిసర ప్రాంతాలలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు ట్రాఫిక్ పోలీసులు. ఎల్బీ స్టేడియం పరిసర ప్రాంతాలలో ట్రాఫిక్ ను మళ్ళిస్తున్నట్టు అధికారులు తెలిపారు.

టీచర్లతో ముఖాముఖి నేపధ్యంలో టీచర్ల ఆలోచన

ఈరోజు ఉదయం నుంచి ట్రాఫిక్ మళ్లింపులు కొనసాగుతున్నాయి ట్రాఫిక్ మళ్లింపును దృష్టిలో పెట్టుకొని ప్రజలు సహకరించాలని హైదరాబాద్ నగర ట్రాఫిక్ పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి తో పదోన్నతి పొందిన ఉపాధ్యాయుల ముఖాముఖి నేపథ్యంలో సీఎం మాట్లాడడానికి అవకాశం ఇస్తే ఉపాధ్యాయ సంఘాల జేఏసీ బాధ్యులు మాట్లాడే అవకాశం ఉంది.

సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్ళే ప్లాన్.. టీచర్లకు ప్రభుత్వ ప్రాధాన్యత

సీఎంకు పదోన్నతులు కల్పించడం పైన కృతజ్ఞతలు తెలియజేయడంతో పాటు ప్రధాన సమస్యలను కూడా సీఎం దృష్టికి తీసుకువెళ్లాలని వారు భావిస్తున్నారు. విద్యారంగ సమస్యలతో పాటు ఉపాధ్యాయుల సమస్యలను కూడా సీఎం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం దిశగా కృషి చేయాలని భావిస్తున్నారు. ప్రభుత్వం ఉపాధ్యాయులకు ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చి ఉపాధ్యాయులను పిలిచి సభ నిర్వహించడం ఉపాధ్యాయులకు ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతకు అద్దం పడుతుంది అన్న చర్చ రాజకీయ వర్గాలలో జోరుగా జరుగుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement