అది సాక్షాత్ తెలంగాణ రాష్ట్ర పరిపాలనా కేంద్ర సచివాలయం. ఈ సెక్రటేరియట్ ఎదురుగా ఓ థాయ్ మసాజ్ సెంటర్ గుట్టుచప్పుడు కాకుండా నడుస్తోంది. దీన్ని హైదరాబాద్లోని సైఫాబాద్ పోలీసులు పసిగట్టారు. తెలంగాణ రాష్ట్ర సచివాలయం ఎదురుగా ఉన్న ఓ హైక్లాస్ హోటల్లో ఈ మసాజ్ సెంటర్ చాలా కాలంగా కొనసాగుతోంది.
ఇక్కడ మేఘవి వెల్నెస్ స్పా పేరుతో మసాజ్ సెంటర్ నిర్వహిస్తున్నారు. కాగా, సైఫాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆకస్మికంగా దాడులు చేశారు. మసాజ్ పేరుతో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న నలుగురు మహిళలను అదుపులోకి తీసుకున్నారు. స్పా నిర్వాహకులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -