ఆంధ్రప్రభ స్మార్ట్, హైదరాబాద్ : ఆర్టీసీ ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాల్లో దృష్టి సారించింది. లాజిస్టిక్స్ (కార్గో) సేవలను మరింతగా విస్తరిస్తోంది. ఇందులో భాగంగా కార్గో హోం డెలివరీ సేవలను ప్రారంభానికి శ్రీకారం చుట్టింది. ఆదివారం పైలట్ ప్రాజెక్టు కింద గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రారంభించారు.
లగేజీలను ఇంటి వద్ద డెలివరీ చేసేలా సేవలు రూపొందించింది. ఇక్కడ విజయవంతం అయితే రాష్ట్రం మొత్తం మీద ఈ సేవలను విస్తరించనుంది. 31 ప్రాంతాల నుంచి హోండెలివరీ సౌకర్యం : మంత్రి పొన్నంప్రత్యామ్నాయ ఆదాయాన్ని పెంచుకునేందుకు గాను లాజిస్టిక్స్(కార్గో) సేవలను టీజీఎస్ఆర్టీసీ మరింతగా విస్తరిస్తోందని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మాత్యులు పొన్నం ప్రభాకర్ తెలిపారు.
హైదరాబాద్ లో వేగవంతమైన సేవలను అందించేందుకు హోం డెలివరీ సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆదివారం నుంచి హైదరాబాద్ లోని 31 ప్రాంతాల నుంచి హోం డెలివరీ సేవలు అందుబాటులో ఉంటాయని వివరించారు.
టీజీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ సెంటర్స్ నుంచి హైదరాబాద్ లో ఎక్కడికైనా హోం డెలివరీ చేయవచ్చని చెప్పారు. రానున్న రోజుల్లో ఇంటి నుంచి ఇంటి వరకు సేవలు అందించేలా లాజిస్టిక్స్ విభాగాన్ని టీజీఎస్ఆర్టీసీ అభివృద్ధి చేస్తోందని తెలిపారు. ప్రజలందరూ హోం డెలివరీ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలని వినియోగదారులను మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు.
పార్శిళ్ల హోం డెలివరీ చార్జీలివే!
0 నుంచి 1 కేజీ పార్శిల్‌కు రూ.501.01నుంచి 5 కేజీలకు రూ.605.01 నుంచి 10 కేజీలకు రూ.6510.1 నుంచి 20 కేజీలకు రూ.7020.1 నుంచి 30 కేజీలకు రూ.7530.1 కేజీలు దాటితే.. స్లాబ్‌ల ఆధారంగా ధరలు ఉంటాయి.