Saturday, June 29, 2024

TG | బోనాల పండుగకు టీజీఎస్పీడీసీఎల్‌ సన్నద్ధం..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : హైదరాబాద్‌ జంట నగరాల్లో జరగనున్న బోనాల పండుగను దృష్టిలో ఉంచుకుని, సదరన్‌ పవర్‌ డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీ ఆఫ్‌ తెలంగాణ లిమిటెడ్‌ నాణ్యమైన, నిరంతర విద్యుత్‌ సరఫరా కోసం సన్నద్ధమైందని సీఎండీ ముషరఫ్‌ ఫారూఖీ అన్నారు.

విద్యుత్‌ శాఖ చీఫ్‌ ఇంజనీర్లు, సూపరింటెండింగ్‌ ఇంజనీర్లతో కార్పొరేట్‌ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలొఆయన మాట్లాడారు… బోనాల పండుగకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను పండుగ ప్రారంభానికి ముందే పూర్తి చేయాలని ఆదేశించారు. ఆలయాల వద్ద విద్యుత్‌ సరఫరా కోసం ప్రతీ ఆలయానికి ఓ నోడల్‌ అధికారి, ఏఈని కేటాయించాలని ఆదేశించారు.

విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఆయన హెచ్చరించారు. బోనాల సందర్భంగా ఆలయాల వద్ద ఏర్పాటు చేసిన అదనపు తాత్కాలిక లైట్లు, ఎయిర్‌ కండిషనింగ్‌, సౌండ్‌ సిస్టమ్‌లతో సహా నెట్‌వర్క్‌ సజావుగా ఉండేలా అధికారులు ఆలయ కమిటీలతో సమన్వయం చేసుకోవాలని సూచించారు.

- Advertisement -

నిరంతర విద్యుత్‌ సరఫరాను కొనసాగించేందుకు పండుగ ప్రారంభం నుండి పూర్తయ్యే వరకు అధికారులు, సిబ్బంధికి 24 గంటల పాటు విధులను కేటాయించాలన్నారు. అగ్ని ప్రమాదాల నివారణకు ప్రత్యామ్నాయ సామాగ్రిని అవసరమైన చోట ఏర్పాటు చేయాలని సూచించారు.

అన్ని విద్యుత్‌ స్తంభాలు ముఖ్యంగా ప్రధాన రహదారులు, లేన్‌లు, బైలేన్‌లలో పెద్ద సంఖ్యలో ప్రజలు గుమికూడే అవకాశం ఉన్న చోట స్తంభాలు షాక్‌లకు గురికాకుండా తనిఖీ చేయాలని సూచించారు. ఈ సందర్భంగా ఇన్‌చార్జి డైరెక్టర్లు నందకుమార్‌, డాక్టర్‌ నర్సింహులు, చీఫ్‌ ఇంజనీర్లు కె.సాయిబాబా, ఎల్‌.పాండ్య, వి.శివాజీ, పి.బిక్షపతి, పి.ఆనంద్‌, సీజీఎం శ్రీకృష్ణారెడ్డి, సూపరిం-టె-ండింగ్‌ ఇంజనీర్లు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement