Wednesday, November 20, 2024

TGPSC ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌… పోస్టుల వివరాలు ఇలా

తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్ (TGPSC) కార్యాలయంలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. ఈ ఖాళీలను డిప్యూటేషన్‌ విధానంలో భర్తీచేయనున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. బీటెక్, ఎంటెక్, ఎంసీఏ విద్యార్హతతో పాటు సంబంధిత విభాగాల్లో కనీసం ఏడాది నుంచి 5 సంవత్సరాల అనుభవం ఉన్నవారు దరఖాస్తుకు అర్హులు.

సరైన అర్హతలు, అనుభవవం ఉన్నవారు ఆఫ్‌లైన్ విధానంలో జూన్20లోగా దరఖాస్తులు సమర్పించవచ్చు. అభ్యర్థులు వెబ్‌సైట్ నుంచి దరఖాస్తు డౌన్‌లోడ్ చేసుకోవాలి. దరఖాస్తుకు నింపి, అవసరమైన అన్ని డాక్యుమెంట్లను జతచేసి నిర్ణీత గడువులోగా సంబంధిత చిరునామాలో సమర్పించాలి. అర్హతలు, అనుభవం ఆధారంగా ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపికచేస్తారు.

వివరాలు..

టీఎస్‌పీఎస్సీలో ఉద్యోగాలు (డిప్యూటేషన్) – ఖాళీల సంఖ్య: 06
ఎంపిక విధానం : అర్హతలు, అనుభవం ఆధారంగా ఎంపికచేస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement