Saturday, September 7, 2024

TGPSC తెలంగాణ గ్రూప్ 2 ప‌రీక్ష‌లు వాయిదా …

ఆగ‌స్ట్ లో జ‌ర‌గాల్సిన ఎగ్జామ్స్
డిసెంబ‌ర్ నాటికి పోస్ట్ పోన్
783 పోస్టుల‌కు 5.50 ల‌క్ష‌ల మంది ద‌ర‌ఖాస్తు

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్ – హైద‌రాబాద్ – తెలంగాణ రాష్ట్రంలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే గ్రూప్ 2 పరీక్ష ప్రభుత్వం వాయిదా వేసింది. ఆగస్ట్ 7,8 తేదీల్లో జరగనున్న గ్రూప్ 2 ఎగ్జామ్ డిసెంబర్ లో నిర్వహించనున్నట్లు టిజిపిఎస్సీ శక్రవారం ప్రకటించింది. డీఎస్సీ పరీక్షలు కూడా అదే సమయంలో ఉన్నాయని గత కొన్ని రోజులుగా అభ్యర్థులు ఆందోళన చేస్తుండగా ప్రభుత్వ ఈ నిర్ణయం తీసుకుంది.

- Advertisement -

గత ప్రభుత్వం వేసిన గ్రూప్‌ – 2 నోటిఫికేషన్ లో 783 పోస్టుల ఉన్నాయి. పలు కారణాలు వల్ల ఇప్పటికే మూడు సార్లు వాయిదా పడ్డ గ్రూప్ 2 ఎగ్జామ్ మరో సారి వాయిదా పడింది. ఈ పోస్టులకు 5.51 లక్షల అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.. ఇది ఇలా ఉంటే ఇప్ప‌టికే ప్రభుత్వం అభ్యర్థులతో చర్చలు జరిపింది. పోస్టులు పెంచి, ఎగ్జామ్ వాయిదా వేయాలని అభ్యర్థులు డిమాండ్ చేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ప్ర‌భుత్వం ప్ర‌స్తుతం ప‌రీక్ష‌ల‌ను మాత్రం వాయిదా వేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement