Friday, October 18, 2024

TGPSC – ఆన్ లైన్ లో గ్రూప్ 1 మెయిన్స్ హాల్ టికెట్స్ …..

హైద‌రాబాద్ : గ్రూప్‌-1 మెయిన్స్ హాల్ టికెట్ల‌ను టీజీపీఎస్సీ సోమ‌వారం మ‌ధ్యాహ్నం విడుద‌ల చేసింది. హాల్ టికెట్ల‌ను టీజీపీఎస్సీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచిన‌ట్లు అధికారులు తెలిపారు. ఈ నెల 21 ఉద‌యం వ‌ర‌కు హాల్ టికెట్లు అందుబాటులో ఉంటాయ‌ని పేర్కొన్నారు. హైద‌రాబాద్(హెచ్‌ఎండీఏతో సహా) పరిధిలో అక్టోబర్ 21 నుంచి 27 వరకు గ్రూప్‌-1 మెయిన్స్ పరీక్షలు జరుగనున్నాయి.

మొత్తం 563 పోస్ట్ లు …

563 గ్రూప్‌-1 పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రిలిమ్స్‌ పరీక్షలను నిర్వహించి ఫలితాలను కూడా విడుదల చేసింది. మెయిన్స్ పరీక్షల నేపథ్యంలో పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నది. ఇప్పటికే గైడ్‌లైన్స్‌ కూడా విడుదల చేసింది. తొలిరోజు తీసుకెళ్లిన హాల్ టిక్కెట్‌నే మిగిలిన ఆరు పరీక్షలకు తీసుకెళ్లాలని.. రోజుకో కొత్త హాల్ టిక్కెట్‌తో వెళితే అనుమతించేది లేదని స్పష్టం చేసింది. ప్రతి అభ్యర్థి తప్పనిసరిగా ప్రతిపరీక్ష రోజు హాల్ టిక్కెట్‌పై తప్పనిసరిగా సంతకం చేయాలని తెలిపింది. నియామక ప్రక్రియ పూర్తి అయ్యేవరకు హాల్‌ టికెట్‌ను జాగ్రత్తగా భద్రపరచుకోవాలని సూచించింది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement