ఏ ఆభరణాలను అనుమతించబోం
నిబంధనలు విడుదల చేసిన అధికారులు
ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా ఇంటికే
హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా రేపు, ఎల్లుండి గ్రూప్-2 పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ పరీక్షల నిర్వహణకు సంబంధించి టీజీపీఎస్సీ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. తెలంగాణ వ్యాప్తంగా 1,368 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ పరీక్షలను ఓఎంఆర్ పద్ధతిలో నిర్వహించనున్నారు. కాగా మొత్తం 783 పోస్టుల భర్తీకి 2022 డిసెంబర్ 29న నోటిఫికేషన్ విడుదలైంది. చేశారు. ఓఎంఆర్ పద్ధతిలో పరీక్షల నిర్వహించనున్న ఈ పరీక్షలకు 5,51,847 మంది దరఖాస్తు చేసుకున్నారు. పలు కారణాల వల్ల గ్రూప్-2 పరీక్ష వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు ఈ నెల 15, 16 తేదీల్లో పరీక్షలను నిర్వహించేందుకు సర్వం సిద్ధం
ఒక్కో పేపర్కు 150 మార్కుల చొప్పున మొత్తం నాలుగు పేపర్లకు 600 మార్కులకు జరుగుతుంది. పరీక్షలు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ఉంటాయి. పరీక్ష ప్రారంభానికి అరగంట ముందు గేట్లు మూసివేస్తామని టీజీపీఎస్సీ ఇప్పటికే స్పష్టం చేసింది.
హాల్ టికెట్ తో పాటు ప్రభుత్వం జారీచేసిన ఫొటో గుర్తింపుకార్డు తీసుకురావాలని తెలిపింది. మంగళసూత్రం, గాజులు ధరించవచ్చని, అభ్యర్థులు చెప్పులు వేసుకుని రావాలని సూచించింది. బెల్ట్‌లు, రిమోట్ కీస్‌కు అనుమతి లేదని తెలిపారు. ఫుల్ స్లీవ్ టాప్ లు ధరించవద్దని కోరింది. బూట్లు పూర్తిగా నిషేధించామన్నారు.. ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రంలోకి అనుమతి ఉండదని పేర్కొన్నారు.. అభ్యర్థులందరూ బయోమెట్రిక్ తప్పనిసరి వేయాలని లేదంటే ఓఎంఆర్ పత్రాలు మూల్యాంకనం చేయబోమని తెలిపింది.
యాడ్ గ్రూప్ 2 ….
మార్చిలో గ్రూప్ వన్, 3 పరీక్షా ఫలితాలు వెల్లడి
వచ్చే ఏడాది మార్చి నాటికి గ్రూప్-1, 3 పరీక్షల ఫలితాలు విడుదల చేస్తామని టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం తెలిపారు. ఇక రేపు, ఎల్లుండి నిర్వహించబోయే గ్రూప్-2 పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేశామని పేర్కొన్నారు. టీజీపీఎస్సీ కేవలం సిలబస్ మాత్రమే ఇస్తుందని, ఏ బుక్ చదవాలన్నది అభ్యర్థుల ఇష్టమని ఆయన చెప్పారు.
గ్రూప్-2కి 5 లక్షల 51 వేల 847 మంది గ్రూప్-2 కోసం దరఖాస్తు చేసుకున్నారని వెల్లడించారు. 75 శాతం ఇప్పటి వరకు హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకున్నారని చెప్పారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్‌పై నమ్మకం ఉంచి పరీక్షలురాయాలని కోరారు. ఎవరి ఓఎంఆర్ షీట్ వారికే ఉంటుందని అంటూ . ప్రతి అభ్యర్థికి బయోమెట్రిక్ తప్పని సరి అని పేర్కొన్నారు. గ్రూప్-2 పరీక్షల ఫలితాలు త్వరగానే ఇస్తామని వెల్లడించారు.. పరీక్షలు సీసీ కెమెరాల పర్యవేక్షణలో జరుగుతాయని టీజీపీఎస్సీ చైర్మన్ పేర్కొన్నారు. అభ్యర్ధులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా పరీక్ష కేంద్రాలలో అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు.