హైదరాబాద్: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్‌పీఎస్సీ) గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష పరీక్ష కొనసాగుతున్నది.. నేటి ఉదయం ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ పరీక్ష జరగనుంది. మొత్తం 897 పరీక్ష కేంద్రాల్లో 4.03 లక్షలమంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు. ఇది ఇలా ఉంటే గ్రూప్ 1 సర్వీస్‌లోని 563 పోస్టుల భర్తీకి ఈ నోటిఫికేషన్ విడుదలైంది. దీనిలో డిప్యూటీ కలెక్టర్, జిల్లా రిజిస్ట్రార్, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, మున్సిపల్ కమిషనర్, అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, జిల్లా పంచాయితీ రాజ్ ఆఫీసర్, అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ వంటి పోస్టులున్నాయి.
.రాజన్న జిల్లాలో 15 పరీక్ష కేంద్రాలు పరీక్ష
..10 గంటలకు పరీక్షా కేంద్రాల గేట్లను మూసివేసిన అధికారులు
సిరిసిల్ల, (ప్రభన్యూస్) : రాజన్న సిరిసిల్ల జిల్లాలో గ్రూప్ వన్ పరీక్ష ప్రారంభమైంది. జిల్లాలోని గ్రూప్ -1 పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట భద్రతా ఏర్పాటు చేసామని, పరీక్ష కేంద్రాల వద్ద ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి, రూట్ లలో ఎస్ఐ స్థాయి అధికారిని నియమించామని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. ఆదివారం సిరిసిల్ల పట్టణంలోని పలు పరీక్ష కేంద్రాలను పరిశీలించి బందోబస్తులో ఉన్న అధికారులకు పలు సూచలు చేశారు. ఎస్పీ వెంట డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, ఇన్స్పెక్టర్ రఘుపతి, ఏఐ మాధుకర్ ఉన్నారు.
మేడ్చల్ లో…
ప్రభ న్యూస్ ప్రతినిధి మేడ్చల్ : గ్రూప్ – 1 ప్రిలిమినరీ పరీక్షలు జూన్ 9 న ఆదివారం మొదలయ్యాయి. ఉదయం 10:30 గంటల నుంచి 1 గంట వరకు పరీక్షను నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటల వరకే పరీక్షా కేంద్రాలలోకి వెళ్లాల్సి ఉంది. దీనితో, పరీక్షా కేంద్రాలకు అభ్యర్ధులు ముందే చేరుకుని, సీటింగ్ ఏర్పాట్లను చుసుకుని, పరీక్షా హాల్లకు పరుగులెత్తారు. మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా 69,727 మంది అభ్యర్థులు గ్రూప్ 1 పరీక్షలు రాయనున్నారు. ఇందుకు గాను జిల్లా యంత్రాంగం 105 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసింది. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ ను విధించారు.