Saturday, September 14, 2024

TG – హైద‌రాబాద్‌లో విస్కీ ఐస్‌క్రీమ్‌ … ఇద్దరు అరెస్ట్ ….

ఐస్‌క్రీమ్‌లో విస్కీ క‌లిపి అమ్మ‌కాలు
వ‌న్ అండ్ ఫైవ్ పార్ల‌ర్‌పై దాడి
గుర్తించిన ఎక్సైజ్ అధికారులు
పోలీసుల అదుపులో నిందితులు

ఆంధ్రప్ర‌భ స్మార్ట్‌, హైద‌రాబాద్‌: ఐస్ క్రీమ్‌లో విస్కీ క‌లిపి అమ్ముతూ దందా చేస్తున్న విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. హైద‌రాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని వన్ అండ్ ఫైవ్ ఐస్‌క్రీమ్ పార్ల‌ర్‌పై జ‌రిపిన దాడుల్లో షాకింగ్ నిజాలు బ‌య‌ట‌ప‌డ్డాయి. 60గ్రాముల ఐస్‌క్రీమ్‌లో 100 ఎంఎల్ విస్కీ క‌లిపి విక్ర‌యిస్తున్నట్టు ఎక్సైజ్ అధికారులు గుర్తించారు. ఈ ఐస్‌క్రీమ్‌ల‌ను పిల్ల‌లు, యువ‌త పెద్ద మొత్తంలో కొనుగోలు చేస్తున్న‌ట్లు పోలీసుల‌కు తెలిసింది.

దీంతో త‌నిఖీలు నిర్వ‌హించి ఐస్‌క్రీమ్ పార్ల‌ర్ య‌జ‌మానులు ద‌యాక‌ర్ రెడ్డి, శోభ‌న్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేప‌ట్టారు. న‌గ‌రంలో వీరికి ఇంకా ఎన్ని ఐస్‌క్రీమ్ పార్ల‌ర్లు ఉన్నాయి, ఇప్ప‌టివ‌ర‌కూ జ‌రిగిన విక్ర‌యాలు ఎన్ని? అన్నదానిపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఇక.. ఈ విష‌యం బ‌య‌ట‌కు రావ‌డంతో త‌ర‌చూ అక్క‌డ ఐస్‌క్రీమ్ కొనుగోలు చేసిన‌ పిల్ల‌ల పేరెంట్స్ ఆందో‌ళ‌న చెందుతున్నారు. ఇలాంటి ఘ‌ట‌న‌లు పున‌రావృతం కాకుండా నిందితుల‌ను క‌ఠినంగా శిక్షించాల‌ని కోరుతున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement