Home తెలంగాణ‌ TG – వీధి కుక్కలకు ఫ్యామిలీ ప్లానింగ్ – వికారాబాద్ జిల్లాకు ప్రథమ స్థానం

TG – వీధి కుక్కలకు ఫ్యామిలీ ప్లానింగ్ – వికారాబాద్ జిల్లాకు ప్రథమ స్థానం

0
TG – వీధి కుక్కలకు ఫ్యామిలీ ప్లానింగ్ – వికారాబాద్  జిల్లాకు ప్రథమ స్థానం

వికారాబాద్ ( ఆంధ్రప్రభ):వీధి కుక్కలకు ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ లో వికారాబాద్ జిల్లా ప్రథమ స్థానంలో ఉందని జిల్లా కలెక్టర్ ప్రతిక్ జైన్ తెలిపారు రాష్ట్రంలో వీధి కుక్కల బెడద నివారించడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లా కలెక్టర్లకు కుక్కల భారీ నుండి ప్రజలను కాపాడాలని ఆదేశించారు

ఇందులోని భాగంగా వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతిక్ జెన్ జిల్లా పశువైద్యాధికారి డాక్టర్ వి సదానందం జిల్లా సిబ్బందితో మాట్లాడి ఏజెన్సీ వ్యవస్థ లేకుండా రాష్ట్రంలోనే వికారాబాద్ జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో ఆయా మున్సిపల్ కమిషనర్లతో మాట్లాడి ఏ బి సి సెంటర్లను ప్రారంభించారు

ఇందులోని భాగంగా వికారాబాద్ పరిగి కొడంగల్ తాండూర్ లో పశు వైద్య సిబ్బంది వీధి కుక్కలకు ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్లు చేశారు మరియు చేస్తున్నారు ఇప్పటివరకు దాదాపు 602 కుక్కలకు ఆపరేషన్ చేశారు ఇప్పుడు చేసిన కుక్కలలో మొత్తం మగ కుక్కలకు ఆపరేషన్ చేశారు ఫిబ్రవరి నెలలో ఆడ కుక్కలకు కూడా ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేస్తామని జిల్లా పశు వైద్యాధికారి డాక్టర్ వి సదానందం తెలిపారు

ఏజెన్సీ వ్యవస్థ కాకుండా మమ్ములను ప్రోత్సహించిన జిల్లా కలెక్టర్ ప్రతిక్ జైన్ కు పశువైద్య సిబ్బంది కృతజ్ఞతలు తెలిపారు.

Exit mobile version