Friday, October 18, 2024

TG: ఉత్తమ్, సీతక్కకు కాంగ్రెస్ హైకమాండ్ కీలక బాధ్యతలు..

మంత్రి సీతక్క, ఉత్తమ్ కుమార్ రెడ్డికి కాంగ్రెస్ హైకమాండ్ కీలక బాధ్యతలను అప్పగించింది. మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ వీరిని సీనియర్ అబ్జర్వర్లుగా నియమించింది.

మరఠ్వాడ ప్రాంతానికి ఉత్తమ్, నార్త్ మహారాష్ట్రకు సీతక్కను అబ్జర్వర్లుగా నియమించింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆదేశాలతో ఏఐసీసీ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు సైతం కాంగ్రెస్ హైకమాండ్ కీలక బాధ్యతలను అప్పగించింది. ఝార్ఖండ్ కు ఆయనను సీనియర్ అబ్జర్వర్ గా నియమించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement