Friday, October 4, 2024

TG | మొహర్రంకు రెండ్రోజుల సెలవు…

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: రానున్న మొహర్రం మాసాన్ని పురస్కరించుకుని 9, 10 తేదీల్లో రెండ్రోజుల సెలవులను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. మొహర్రం మాసంలో షియా, సున్నీ ముస్లింలు సంతాప దినాలుగా జురపుకోవడం ఆనవాయితీ. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం మొహర్రం 9, 10 తేదీలకు సెలవును ప్రకటిస్తూ, శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.

మహాప్రవక్త మనవడు హజ్రత్‌ ఇమాం హుస్సేన్‌తో పాటు 72 మంది కుటుంబ సభ్యులు యజీదుల చేతుల్లో షహీదులైన వైనాన్ని పురస్కరించుకుని విశ్వవ్యాప్తంగా సంతాప దినాలు నిర్వహిస్తారు. ఇస్లామిక్‌ క్యాలెండర్‌ ప్రకారం, మొహర్రం మొదటి నెల. కాగా ఈ నెల విషాదాలతో మొదలవుతోంది.

అయితే మొహర్రం మాసంలో 10 వ రోజున షియా ముస్లింలు ఆలం (పీర్ల)ను ఊరేగిస్తుంటారు. హజరత్‌ ఇమాం హుస్సేన్‌ను స్మరిస్తూ.. తమ సంతాపం తెలుపుతారు. సున్నీ తెగకు చెందిన ముస్లింలు ఉపవాస దీక్షలతో పాటు ప్రత్యేక ప్రార్థనలు జరుపుకుంటారు. మొహర్రం సందర్భంగా తెలంగాణ సర్కారు రెండ్రోజులు హాలీడేస్‌ ప్రకటించింది. అధికారిక క్యాలెండర్‌ ప్రకారం…జూలై 16, 17 తేదీల్లో ప్రభుత్వోద్యోగులు, విద్యార్థులకు సెలవులు ప్రకటించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement