Wednesday, November 20, 2024

TG – సమ్మె ఉన్నా పత్తి కొనుగోళ్లు చేయాల్సిందే – మంత్రి తుమ్మల

లెక్కలోకి తీసుకోవద్దు

రైతులు నష్టపోయే ప్రమాదం ఉంది

తక్కువ ధరకు పత్తి అమ్ముకునే పరిస్థితి తేవద్దు

జిన్నింగ్ మిల్లర్లతో మాట్లాడి సెట్ చేయండి

- Advertisement -

సీసీఐ సీఎండీకి సూచించిన మంత్రి తుమ్మల

వెంటనే చర్యలు తీసుకోవాలని సీఎస్కు ఆదేశాలు

ఆంధ్రప్రభ స్మార్ట్, హైదరాబాద్:పత్తి రైతులను ఇబ్బందిపెట్టకుండా వెంటనే పత్తి కొనుగోళ్లు చేపట్టాలని సీసీఐ అధికారులకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. సోమవారం సీసీఐ (కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) సీఎండీతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో మాట్లాడారు. కాగా, తెలంగాణలో పత్తి జిన్నింగ్ మిల్లర్లు సమ్మె ప్రకటించిన నేపథ్యంలో స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. సమ్మె కారణంగా పత్తి రైతులు ఇబ్బందులు పడకుండా, పత్తిని తక్కువ ధరలకు అమ్ముకునే పరిస్థితులు తలెత్తకూడదన్నారు.

పత్తి జిన్నింగ్ మిల్లర్లతో చర్చలు జరిపి, కొనుగోళ్లు తక్షణమే ప్రారంభించాలని ఆదేశించారు. రైతులు ఇబ్బందులకు గురికాకుండా, కష్టాలు పడకుండా.. పత్తిని తక్కు ధరలకు విక్రయించవలసిన అవసరం లేకుండా చర్యలు వెంటనే తీసుకోవాలని స్పష్టం చేశారు. ఇది రైతుల ప్రయోజనాలను కాపాడడంలో కీలకమని మంత్రి తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement