Friday, November 22, 2024

TG ధాన్యం ఉత్పత్తిలో అగ్ర‌గామిగా తెలంగాణ‌ – మంత్రి తుమ్మల

హైదరాబాద్‌లోని తాజ్‌కృష్ణ వేదికగా జరుగుతున్న ప్రపంచ వరి సదస్సును వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శుక్ర‌వారం ప్రారంభించారు. రెండు రోజులపాటు జ‌రిగే ఈ సదస్సులో భారత్‌ సహా 30 దేశాలు పాల్గొన్నాయి. శాస్త్రవేత్తలు, రైస్‌ మిల్లర్ల సంఘాల ప్రతినిధులతోపాటు 250 మందికిపైగా ప్రతినిధులు పాల్గొన్నారు. భారత్‌లో వరిసాగు, ఉత్పత్తి, నాణ్యత, విదేశీ ఎగుమతుల పెంపుపై చ‌ర్చించ‌నున్నారు. టెక్నాలజీ, మార్కెటింగ్‌, ఆహార భద్రత లక్ష్యాలుగా ఈ స‌ద‌స్సులో మేధోమథనం జరుగనుంది.

రైస్ స‌మ్మిట్ నిర్వ‌హించ‌డం సంతోషం..

ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. తెలంగాణ కొత్తగా ఏర్పడిన రాష్ట్రమన్నారు. ఇటీవలే దశాబ్ది ఉత్సవాలు జరుపుకున్నామని చెప్పారు. రాష్ట్రంలో రైస్‌ సమ్మిట్‌ నిర్వహించడం సంతోషంగా ఉందని తెలిపారు. ధాన్యం ఉత్పత్తిలో రాష్ట్రం అగ్రగామిగా ఉందని వెల్లడించారు. తెలంగాణలో క్రమంగా ధాన్యం ఉత్పత్తి పెరుగుతోంద‌న్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1.2 కోట్ల ఎకరాల్లో ధాన్యం ఉత్పత్తి జరుగుతున్నదని పేర్కొన్నారు. ఆహార భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందన్నారు. అందరికీ ఆహార భద్రత కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement