హైదరాబాద్ – టీటీడీ బోర్డు చైర్మన్ గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన బీఆర్ నాయుడు గురువారం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిశారు. జూబ్లీహిల్స్ లోని సీఎం నివాసానికి వెళ్లిన నాయడు సిఎంతో భేటి అయ్యారు. ఈ సందర్బంగా శ్రీవారి ప్రసాదం అందజేశారు. అనంతరం తిరుమల ఆలయ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై ఇరువురు కాసేపు చర్చించారు. తిరుమలలో స్వామివారి దర్శనం విషయంలో తెలంగాణ ప్రజాప్రతినిధుల లేఖలను అనుమతి ఇచ్చే విషయాన్ని టిటిడి చైర్మన్ దృష్టికి తెచ్చారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement