Friday, November 22, 2024

TG – సౌర విద్యుత్‌ ఉత్పత్తికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాం – ఉప ముఖ్యమంత్రి భట్టి

అశ్వరావుపేట: . సౌర విద్యుత్‌ ఉత్పత్తికి పైలట్‌ ప్రాజెక్టు కింద గ్రామాలను ఎంపిక చేస్తామని సూచన ప్రాయంగా వెల్లడించారు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట పామాయిల్ ఫ్యాక్టరీలో రూ.36.50 కోట్లతో నిర్మించిన 2.5 మెగావాట్ల పవర్ ప్లాంట్‌ను భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తో కలసి ఫ్రారంభించారు .

ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ, ప్రకృతి వనరులను వినియోగించుకుని కాలుష్యరహితంగా 20వేల మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తికి ప్రయత్నిస్తున్నామని తెలిపారు..వ్యవసాయ రంగానికి బడ్జెట్‌లో రూ.73వేల కోట్లు కేటాయించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు.

.’కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి విజయదశమి ఇది. రాష్ట్ర ప్రజలు విజయాలు పొందే విధంగా ప్రభుత్వం తరఫున అండగా ఉంటామని హామీ ఇస్తున్నాం. గత పాలకులు అరకొర రుణమాఫీ చేసి చేతులు దులుపుకొన్నారు. ఇప్పుడొచ్చి తగుదునమ్మా అని మాపై దుష్ప్రచారం చేస్తున్నారు. ఏ వెసులుబాటు ఉన్నా మిగిలిన రైతులకు కూడా రుణమాఫీ చేస్తాం. భవిష్యత్‌లో రైతులకు పంటల బీమా ప్రీమియం రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుంది” అని భట్టి తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement