Friday, November 22, 2024

TG – మీకు మా థ్యాంక్స్ … ఉపముఖ్యమంత్రి భ‌ట్టితో తిస్మా ప్రతినిధులు

విద్యుత్ చార్జీలు య‌ధాత‌థంగా ఉంచి ప్రాణం పోశారు
చిన్న ప‌రిశ్ర‌మ‌ల‌కు ఈ నిర్ణ‌యం గొప్ప ఊర‌ట‌
24 గంట‌ల విద్యుత్ స‌ర‌ఫ‌రాతో ఫ్యాక్ట‌రీల‌కు బాస‌ట‌
భ‌ట్టితో ఐరన్, స్టీల్ అసోసియేషన్ ప్ర‌తినిధుల థ్యాంక్స్ మీట్

హైద‌రాబాద్ …. విద్యుత్ ఛార్జీలు పెంచకపోవడం సాహసోపేత నిర్ణయం అని ఐరన్, స్టీల్ అసోసియేషన్ ప్ర‌తినిధులు అన్నారు. విద్యుత్ ఛార్జీలు పెంచకుండా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సాహసోపీతమైనదని పరిశ్రమల యజమానులు తెలిపారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కను నేడు ప్ర‌జాభ‌వ‌న్ లో తిస్మా ప్రతినిధులు క‌లిసి ఈ మేర‌కు అభినందించారు. ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ, చార్జీలు పెంచితే రాష్ట్రాల్లోని స్టీల్, ఐరన్ పరిశ్రమలు మూసి వేసుకునే పరిస్థితి ఏర్పడేదని వివరించారు. విద్యుత్ ఛార్జీలు పెంచకపోవడం, 24 గంటల పాటు అంతరాయం లేకుండా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడం మూలంగా తమ పరిశ్రమలకు గొప్ప ఊరట లభించింది అని భట్టి విక్రమార్క కు తెలిపారు.

- Advertisement -

కాగా, ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహాన్ని అందిపుచ్చుకొని గ్రామీణ ప్రాంతాల్లో పరిశ్రమలు విస్తరించాలని డిప్యూటీ సీఎం ప్రతినిధులకు సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లోకి పరిశ్రమలు విస్తరించడం మూలంగా స్థానిక యువతకు ఉపాధి, ఆలయ మార్గాలు లభిస్తాయని.. పరిశ్రమలకు తక్కువ ధరలో వనరులు లభిస్తాయని.. ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుందని వారికి వివరించారు. సీఎంను కలిసిన వారిలో జాయింట్ ప్రెసిడెంట్ ప్రమోద్ అగర్వాల్, వైస్ ప్రెసిడెంట్ నీరజ్ గొయెంక, జాయింట్ సెక్రెటరీ సుధాంశు శేఖర్, కోశాధికారి వినోద్ అగర్వాల్ తదితరులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement