భద్రాద్రి థర్మల్ పవర్ విద్యుత్ కేంద్రంలో పిడుగుపాటుకు పడటంతో ట్రాన్స్ఫారం పేలింది. దీంతో.. ట్రిప్ అయి మొదటి యూనిట్ నిలిచిపోయింది. భద్రాద్రి పవర్ ప్లాంట్ 1 యూనిట్ పై పిడుగుపాటు ప్రమాదం పై మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ఆరా తీస్తున్నారు..
బీ.టీ.పీ.ఎస్ సీ.ఈ తో ఫోన్ లో మాట్లాడిన మంత్రి తుమ్మల.. పిడుగుపాటు ప్రమాద వివరాలు అధికారుల నుంచి తెలుసుకున్నారు. 270 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి షట్ డౌన్ అయినట్లు తెలుస్తోంది. జనరేషన్ ట్రాన్స్ ఫార్మర్ లో మంటలు చెలరేగినట్లు సమాచారం. అయితే.. స్విచ్ యార్డ్ ప్రాంతంలో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. హుటాహుటిన సంఘటన స్థలానికి అధికారుల చేరుకొని ముందుస్తు చర్యగా.. యూనిట్-1, యూనిట్-2ను షట్ డౌన్ చేశారు.
- Advertisement -