Monday, January 13, 2025

TG – ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పై మూడు కేసులు నమోదు

కరీంనగర్ క్రైమ్ ఆంధ్రప్రభ హుజరాబాద్ శాసనసభ్యులు పాడి కౌశిక్ పై కరీంనగర్ ఒకటవ పోలీస్ స్టేషన్లో మూడు కేసులు నమోదు అయ్యాయి. కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో జరిగిన సమీక్ష సమావేశంలో జగిత్యాల శాసనసభ్యులు సంజయ్ కుమార్ దురుసుగా కౌశిక్ రెడ్డి ప్రవర్తించారని ఎమ్మెల్యే పిఏ ఇచ్చిన ఫిర్యాదు పై కేసు నమోదు చేశారు.

అలాగే గ్రంధాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేష్ తనను సమావేశం వద్ద అడ్డుకున్నారని ఇచ్చిన ఫిర్యాదు పై మరో కేసు నమోదు అయింది. దీంతోపాటు ఆర్డీవో సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గందరగోళం సృష్టించారని ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇంకొక కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యే పై వేర్వేరుగా మూడు కేసులు నమోదు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement