హైదరాబాద్ : ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లిన మాజీ మంత్రులు హరీశ్ రావు,జగదీష్ రెడ్డితో పాటు ఎమ్మెల్యే కొత్తకోట ప్రభాకరరెడ్డి, ఎమ్మెల్సీ శంబీపూర్ రాజ తదితర నేతలను అరెస్ట్ చేయడాన్ని తప్పు పట్టారు ఎమ్మెల్సీ కవిత … ఈ మేరకు ఆమె ట్విట్ చేశారు.. ఈ అక్రమ అరెస్ట్ లను తాను ఖండిస్తునట్లు పేర్కొన్నారు.. ప్రస్తుతం రాష్ట్రంలో కొనసాగుతున్నది ప్రజా పాలన కాదని, ఇందిరమ్మ ఎమర్జెన్సీ పాలన అంటూ విమర్శించారు.. అరెస్ట్ చేసిన నేతలందర్ని వెంటనే విడుదల చేయాలని డిజెపిని కోరారు..
రాక్షస పాలనే – హరీశ్ రావు
ఏడాది పాలన సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వ హామీలపై ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ నేతలను పోలీసులు అరెస్టు చేస్తున్న నేపథ్యంలో రేవంత్ ది ప్రజాస్వామ్య పాలన కాదు.. రాక్షస పాలన అని ధ్వజమెత్తారు. ఈ మేరకు హరీశ్‌రావు ఎక్స్ వేదికగా స్పందించారు.
ఇందిరమ్మ రాజ్యమా..? ఎమర్జెన్సీ పాలనా..? అని నిలదీశారు హరీశ్‌రావు.
ఫోన్ ట్యాపింగ్ చేశారంటూ ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్‌కు వెళ్తే ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై ఉల్టా కేసు బనాయించారు. ఉదయాన్నే పదుల సంఖ్యలో పోలీసులు ఎమ్మెల్యే ఇంటి మీదకు వచ్చి అక్రమ అరెస్టు చేసే ప్రయత్నం చేశారు. ఈ దుర్మార్గాన్ని ప్రశ్నిస్తే, నాపై, బీఆర్ఎస్ నాయకులపై దుర్మార్గంగా ప్రవర్తించారు. అక్రమ అరెస్టు చేసి పోలీసు స్టేషన్‌కు తరలిస్తున్నారు. అడిగితే అరెస్టులు, ప్రశ్నిస్తే కేసులు, నిలదీస్తే బెదిరింపులు. ప్రజాస్వామ్య పాలన అని డబ్బా కొడుతూ, రాక్షస పాలన కొనసాగిస్తున్నావు. నీ పిట్ట బెదిరింపులకు, అక్రమ కేసులకు భయపడే వాళ్ళం కాదు. తెలంగాణ సమాజమే నీకు బుద్ధి చెబుతుంది అని రేవంత్ రెడ్డిపై హరీశ్‌రావు నిప్పులు చెరిగారు.