Thursday, December 12, 2024

TG – రైతుల‌పై థ‌ర్డ్ ఢిగ్రీ ప్ర‌యోగం – కెటిఆర్

హైదరాబాద్ – ల‌గ‌చ‌ర్ల దాడి కేసులో అరెస్టై జైలులో నిందితులుగా ఉన్న రైతుల‌పై పోలీసులు థ‌ర్డ్ డిగ్రీ ప్ర‌యోగించార‌ని బిఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఆరోపించారు.. నిందుతుడైన ఈర్యా నాయ‌క్ కు నేడు గుండె పోటు రావ‌డంతో చికిత్స కోసం హాస్ప‌ట‌ల్ కు త‌ర‌లించారు.. అలాగే ఆ రైతుకు బేడీలు వేసి ఆసుప‌త్రికి తీసుకురావ‌డం ప‌ట్ల కెటిఆర్ ఆగ్రహం వ్య‌క్తం చేశారు.. ఇదే నా ఇందిర‌మ్మ పాల‌న అంటూ ప్ర‌శ్నించారు. తెలంగాణ భ‌వ‌న్ లో ఆయ‌న నేడు మీడియాతో మాట్లాడుతూ, ఇది ఇలా ఉంటే అరెస్ట్ అయిన వ్యక్తికి గుండెపోటు వస్తే కనీసం కుటుంబ సభ్యులకు కూడా చెప్పరాఅంటూ నిల‌దీశారు. . తనపై ఎలాంటి దాడి జరగలేదని స్వయంగా కలెక్టరేనే చెప్పారని, తమ నిరసనను రైతులు గట్టిగా వినిపించారని కేటీఆర్ తెలిపారు. నెల క్రితం ప్రభుత్వంపై లగచర్ల రైతులు తిరగబడ్డారని గుర్తు చేశారు. రారాజు, చక్రవర్తిలా సీఎం రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారని కేటీఆర్ విమర్శించారు.

రాహుల్ గాంధీకి మానవత్వం అనేది ఉంటే రేవంత్ రెడ్డిని మందలించాల‌ని కోరారు… ఆయన ఏమో జైపూర్లో విందులు వినోదాలతో హ్యాపీగా ఉన్నార‌ని, ఇక్కడ ఏమో కేవలం తమ భూమిని ప్రభుత్వం డిమాండ్ చేసిన విధంగా తాము ఇవ్వం అని చెప్పిన పాపానికి గిరిజన రైతులు జైలులో చనిపోయే పరిస్థితిలో ఉన్నార‌ని అన్నారు కెటిఆర్. రాహుల్ గాంధీ నీకు హృదయం ఉంటే వెంటనే రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి కేసులు వాపస్ తీసుకొని వాళ్లను వదిలిపెట్టమని చెప్పు అని కోరారు.. జైల్లో మ‌గ్గుతున్న రైతుల‌కు తాము వాళ్ళకి ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయిస్తామ‌ని ప్ర‌క‌టించారు..అలాగే గౌరవ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని, రాష్ట్ర గవర్నర్ ని, రాహుల్ గాంధీని కోరుతున్నా వెంటనే అరెస్ట్ అయిన వాళ్లను విడుదల చేయండి అని కోరారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement