హైదరాబాద్ – బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఇంట్లో చోరీ జరిగింది. ఇంట్లో ఉన్న లక్షన్నర నగదుతో పాటు.. అభరణాలు చోరీ చేశారట దొంగలు. దీంతో… ఫిలిం నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు పొన్నాల సతీమణి అరుణాదేవి.
రంగంలోకి దిగారు పోలీసులు. కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు పోలీసులు. ఇక.. ఈ సంఘటన జరిగిన సమయంలో పొన్నాల లక్ష్మయ్య ఫ్యామిలీ ఇంట్లో లేరని సమాచారం. జనగామాలో ఉన్నట్లు చెబుతున్నారు.
- Advertisement -