హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత రికార్డు స్థాయిలో ధాన్యం దిగుబడి వచ్చిందని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్’ వేదికగా పోస్టు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు తో సంబంధం లేకుండా ఈ ఘనత సాధించినట్లు చెప్పారు. దీంతో కాళేశ్వరం వల్లే వరి సాగు పెరిగిందన్న బిఆర్ఎస్ ప్రచారం పటాపంచలైందన్నారు. తెలంగాణ రైతు దేశానికే గర్వకారణమని పేర్కొన్నారు. అన్నదాత శ్రమ వల్లే ఇది సాధ్యమైందని చెప్పారు. అత్యధిక దిగుబడి ఘనత సాధించేందుకు కారణమైన ప్రతి రైతుకు రేవంత్రెడ్డి అభినందనలు తెలిపారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement