Saturday, November 23, 2024

TG – ఒక వైపు కెటిఆర్ కు రాఖీలు… మ‌రో వైపు క్ష‌మాప‌ణ చెప్పాల‌ని నినాదాలు

హైదరాబాద్‌: ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం గురించి మాట్లాడుతూ . మహిళలపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో బిఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ మహిళా కమిషన్‌ ముందు విచారణకు హాజరయ్యారు. పార్టీ మహిళా నేతలతో కలిసి హైదరాబాద్‌ తెలంగాణ భవన్‌ నుంచి బయల్దేరిన కేటీఆర్‌.. ట్యాంక్‌బండ్‌లోని బుద్ధభవన్‌లో ఉన్న మహిళా కమిషన్‌ కార్యాలయానికి చేరుకున్నారు. అయితే కేటీఆర్‌ను మాత్రమే ఆఫీస్‌లోకి అనుమతించిన పోలీసులు బీఆర్‌ఎస్‌ మహిళా కార్పొరేటర్లు, నాయకులను అడ్డుకున్నారు. దీంతో వారు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

మరోవైపు కేటీఆర్‌ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేస్తూ.. మహిళా కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షురాలు సునీత, నేతలు బుద్ధభవన్‌ మహిళా కమిషన్‌ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. మహిళా లోకాన్ని ఆయన అవమానించారని విమర్శించారు. పోటాపోటీ ఆందోళనలతో కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. భారాస, కాంగ్రెస్‌ మహిళా నేతల మధ్య తోపులాట చోటు చేసుకుంది.

ఇరు వర్గాలు పోటాపోటీ నినాదాలు చేసుకున్నారు. ఒకరినొకరు తోసుకోవడంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. వారిని అదుపుచేయడానికి పోలీసులు శ్రమించాల్సి వచ్చింది. ఈ క్రమంలో మహిళా కమిషన్‌ కార్యాలయం వద్ద మహిళా కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షురాలు బైఠాయించారు. మహిళలకు కేటీఆర్‌ క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు.

- Advertisement -

రాఖీలు క‌ట్టిన మ‌హిళా నేత‌లు..

కాగా , విచార‌ణ‌కు హాజ‌రైన కెటిఆర్ కు మ‌హిళా క‌మిష‌న్ లోని ప‌లువురు ఆయ‌న‌కు రాఖీలు క‌ట్టారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement