Thursday, January 9, 2025

TG – ఆలయ భూముల కౌలు చెల్లింపులు….. పట్టించుకునేది ఎవరు ?

జడ్చర్ల, ఆంధ్రప్రభ : మహబూబ్నగర్ జిల్లాలో పేరుగాంచిన పురాతన దేవాలయాల్లో ఒకటిగా ఉన్న శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి గంగాపురం ఆలయానికి రావలసిన కౌలు చెల్లింపు మొండి బకాయిలు గత కొన్నేళ్ల నుంచి రావాల్సి ఉన్న రావడంలేదని, గతంలో ఎవరెవరికి కౌలు ఇచ్చారన్న వివరాల కు సంబంధించిన రికార్డులు ఆలయ కార్యాలయంలో లేకపోవడం తీవ్ర ఆరోపణలకు దారితీస్తున్నది.

ఆలయానికి సంబంధించి 119 ఎకరాల భూములు గంగాపురం గ్రామంలో ఉన్నాయి. ఈ భూములకు ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలలో భాగంగా నిర్వహించే వేలంపాటలో గ్రామానికి చెందినవారు దక్కించుకోవలసి ఉంటుంది, వేలంపాటలో పాల్గొనే వారికి కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయని, ఒకసారి వేలంపాటలో దక్కించుకొని కౌలు చెల్లింపు సరిగా చేస్తేనే భవిష్యత్తులో మళ్ళీ వేలం పాటలో పాల్గొనాలని నిబంధనలు ఉన్నాయి. గత ఎనిమిదేళ్ల నుంచి జరిగిన వేలంపాటలో పాల్గొన్న వ్యక్తి నేటికీ 25 వేలకు పైగా బకాయి ఉన్న నేటికీ ఆ కౌలు చెల్లింపు చేయడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి.ఈ అంశాలపై తవ్వే కొద్ది ఇంకా ఎన్ని విషయాలు వెలుగులోకి వస్తాయో, ఆలయ నిర్వహణ లో భాగంగా అనేక అవకతవకలు జరిగినట్లు , కౌలు చెల్లింపు చెల్లింపునకు సంబంధించి రికార్డులు నమోదు చేయడంలో పూర్తి విఫలంగా వ్యవహరించినట్టు విశ్వసనీయ సమాచారం . ఇప్పటికైనా అధికారులు స్పందించి కౌలు బకాయిల పై విచారణ జరిపి మొండి బకాయిలు వసూలు చేసి ఆలయ అభివృద్ధికి దోహదపడాలని భక్తులు కోరుతున్నారు .

ఈ విషయమై ఆంధ్రప్రభ రిపోర్టర్ ఆలయ ఈవో దీప్తి రెడ్డి ని సంప్రదించగా ఇటీవలే పదవి బాధ్యతలను చేపట్టానని , కార్యాలయంలో ఉన్న సమాచారం మేరకు కౌలు చెల్లింపులో జాప్యం ఎందుకు జరిగిందన్న అంశాలు ఆరా తీసి , వారికి నోటీసులు అందజేస్తామని, ప్రతి సంవత్సరం కౌలు చెల్లింపు ద్వారా దేవాలయానికి నాలుగు లక్షలకు పైగా ఆదాయం రానున్నట్లు ఆలయ ఈవోతెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement