సభ్యుల నుంచి విరాళాలకు ఆహ్వానం
వైద్య ఖర్చులు భరించేందుకు ముందుకు వచ్చిన ఛాంబర్
హైదరాబాద్ – సంధ్య థియేటర్ లో ఈ నెల 4వ తేదిన జరిగిన తొక్కిసలాటలో గాయపడి చికిత్స పొందుతున్న శ్రీతేజ్ కు అండంగా నిలవాలని తెలంగాణ పిల్మ్ ఛాంబర్ నిర్ణయించింది.. బాలుడి వైద్య ఖర్చుల కోసం తమ సభ్యుల నుంచి విరాళాలు సేకరించి ఇవ్వాలని నిర్ణయించింది.. ఈ మేరకు తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఒక ప్రకటన విడుదల చేసింది..
సంధ్య దియేటర్ సంఘటన దురదృష్టకరమంటూ పేర్కొన్న చాంబర్ ఈ ప్రమాదంలో మరణించిన రేవతికి సంతాపం ప్రకటించింది.. అలాగే ఆమె కుటుంబానికి అవసరమైన సాయం తమ చాంబర్ తరుపున అందజేస్తామని పేర్కొంది.. అలాగే ఫిల్మ్ ఛాంబర్ లో సభ్యులుగా ఉన్నవారు శ్రీతేజ్ వైద్య ఖర్చుల కోసం విరాళాలు ఇవ్వాలని కోరింది. వచ్చిన విరాళాలను శ్రీతేజ్ కుటుంబానికి అందిస్తామని తెలంగాణ ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ సునీల్ నారంగ్ తెలిపారు..