జగదీష్ రెడ్డి పిటిషన్ ను తొసిపుచ్చిన ధర్మాసనం
కేసు పురోగతి రేవంత్ కు చెప్పవద్దన్న కోర్టు
హైదరాబాద్ – ఓటుకు నోటు కేసును మధ్యప్రదేశ్ రాష్ట్రానికి బదిలీ చేయాలని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీం కోర్టు తొసిపుచ్చింది.. ప్రస్తుతం జరుగుతున్న కోర్టులోనే విచారణ కొనసాగించాలని ఆదేశించింది .. కాగా, జగదీష్ పిటిషన్ పై నేడు జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్ ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. కేసులో రేవంత్‌రెడ్డి విచారణను ప్రభావితం చేస్తారనే విషయం అపోహ మాత్రమేనని అభిప్రాయ పడింది. ఈ విషయంలో ఊహాజనిత జగదీష్‌రెడ్డి పిటిషన్‌ను ఆమోదించలేమని పేర్కొంది. స్పష్టమైన ఆధారాలు లేకుండా పిటిషన్ దాఖలు చేశారని తెలిపింది. కేసును మరో రాష్ట్రానికి బదిలీ చేసేందుకు కోర్టు నిరాకరించింది. దీంతో ఓటు నోటు కేసులో సీఎం రేవంత్‌రెడ్డి ఊరట లభించినట్లైంది
సిఎం, హోం మంత్రికి కేసు వివరాలు చెప్పకండి..
అదేవిధంగా దర్యాప్తు విషయంలో సీఎం , హోమంత్రి కి ఏసీబీ డీజీ రిపోర్టు చేయనక్కర్లేదని ధర్మాసనం పేర్కొంది. విచారణలో రేవంత్ జోక్యం చేసుకోవద్దని, ఒకవేళ జోక్యం చేసుకుంటే పిటిషనర్ సుప్రీం కోర్టును ఆశ్రయించవచ్చని కోర్టు పేర్కొంది. ట్రయల్ కోర్టు కూడా పారదర్శకంగా కేసు విచారణను పాదర్శకంగా చేపట్టాలని తెలిపింది.
రేవంత్ క్షమాపణలు ఓకే …
ఇటీవల కవిత బెయిల్ కు వచ్చిన సందర్భంగా రేవంత్ చేసిన వ్యాఖ్యాలను సుప్రీం కోర్టు తప్ప పట్టింది. తమ తీర్పులపై అభిప్రాయం చెప్పే హక్కు అందరికీ ఉందని అన్నారు. ప్రజా జీవితంలో ఉన్నవారు ఆచితూచి మాట్లాడాలని సూచించారు. కాగా, సుప్రీం వ్యాఖ్యల నేపథ్యంలో రేవంత్ సుప్రీం కోర్టుకు క్షమాపణ లు చెప్పారు.. ఈ సారీని అంగీకరిస్తున్నామని,ఇకపై న్యాయ స్థానాల తీర్పులు పైనా, న్యాయ స్థానాలపైనా ఎటువంటి వ్యాఖ్యలు చేయవద్దని కోరింది..