Sunday, November 17, 2024

TG – సుప్రీంలో కెసిఆర్ కు కాస్త ఊర‌ట‌ .. మ‌రికాస్త ఖేదం

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్ – హైద‌రాబాద్ – ఛత్తీస్ గఢ్ విద్యుత్ కొనుగోళ్లు, భద్రాద్రి, యాదాద్రి థర్మల్ ప్లాంట్ల నిర్మాణాలపై కాంగ్రెస్ సర్కారు నియమించిన నర్సింహారెడ్డి కమిషన్ ను నిలుపుద‌ల చేయాల‌ని కోరుతూ మాజీ ముఖ్య‌మంత్రి కెసిఆర్ వేసిన పిటిష‌న్ ను మంగళవారం సుప్రీం కోర్టు డిస్మిస్ చేసింది. దీనిపై ఇరు వ‌ర్గాల వాద‌న‌ల విన్న త్రిస‌భ్య ధ‌ర్మాస‌నం కొన్ని కీల‌క ఆదేశాల‌ను జారీ చేసింది. ప్ర‌స్తుతం కొన‌సాగుత‌న్న జ్యుడీషియల్ విచారణ క‌మిటీ అన‌కుండా దానిని ఎంక్వైరీ కమిషన్ గామాత్ర‌మే వ్యవహరించాలని సూచించింది. ఇక త‌క్ష‌ణం ఆ క‌మిష‌న్ ఛైర్మ‌న్ పోస్ట్ నుంచి నర్సింహా రెడ్డి తొల‌గించి వేరొకరిని నియమించాలని తెలంగాణ ప్ర‌భుత్వాన్ని ఆదేశించింది.. దీనిపై ప్ర‌భుత్వ న్యాయ‌వాది స్పందించి సోమవారం లోగా కొత్త ఛైర్మ‌న్ ను నియ‌మిస్తామ‌ని,అందుకు స‌మ‌యం ఇవ్వాల‌ని అభ్య‌ర్ధించారు… ఇదే స‌మ‌యంలో విచారణ నుంచి తప్పుకుంటున్నట్లు జస్టిస్ నరసింహా రెడ్డి ప్ర‌క‌టించారు. ఆయ‌న రాజీనామా లేఖ‌ను పీని సుప్రీం కోర్టుకు న్యాయవాదులు అందించారు.

ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టు స్పందిస్తూ ఇప్పటికే ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారమే కొత్త జడ్జి నేతృత్వంలో కమిషన్ విచారణ కొనసాగించొచ్చని అభిప్రాయపడింది. వచ్చే సోమవారం లోపు కమిషన్‌కు నూతన చైర్మన్‌ను నియమిస్తామని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టు ధర్మాసనానికి తెలిపింది. సోమవారం లోపు కోర్టుకు కొత్త చైర్మన్ పేరును వెల్లడిస్తామని అభిషేక్ మనుసింఘ్వీ కోర్టుకు విన్న‌వించారు. దీనిపై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి స్పందిస్తూ నోటిఫికేషన్ విడుదల చేయాలని ఆదేశించారు. అలాగే కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ ముగిస్తున్నట్లు సీజేఐ ప్రకటించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement