Friday, November 22, 2024

TG – 21న సుప్రీంలో గ్రూప్ 1 అభ్య‌ర్ధుల పిటిష‌న్ విచార‌ణ

అదే రోజు నుంచి గ్రూప్ వ‌న్ మెయిన్స్ ప‌రీక్ష‌లు
దీంతో ఆ రోజు ఉద‌యాన్ని విచారిస్తామ‌న్న చీఫ్ జ‌స్జీస్
సుప్రీం తీర్పుపై అభ్య‌ర్ధుల ఆశ‌లు

న్యూఢిల్లీ: గ్రూప్‌-1 పరీక్షలను వాయిదా వేయాలంటూ అభ్యర్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తమ పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలంటూ నేడు చీఫ్‌ జస్టిస్‌ కోర్టులో స్పెషల్‌ మోషన్‌ దాఖలు చేశారు. అభ్యర్థుల తరఫున అడ్వకేట్‌ మోహిత్‌రావు సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. పరీక్షల్లో రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ను ఫాలో కాలేదన అందులో పేర్కొన్నారు. అయితే కేసు సోమవారం విచారణ జరుపుతామని సీజేఐ జస్టిస్‌ చంద్రచూడ్‌ వెల్లడించారు. అదే రోజు మ‌ధ్యాహ్నం నుంచి మెయిన్స్ ప‌రీక్ష‌లు పారంభం కానున్న నేప‌థ్యాన్ని దృష్టిలో ఉంచుకుని మొదటి కేసుగా ఉదయం 10.30 గంటలకు విచారించనున్నట్లు ఆయ‌న ప్ర‌క‌టించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement