Wednesday, January 15, 2025

TG – ఎసిబికి చిక్కిన మెట్ పల్లి సబ్ రిజిస్ట్రార్ ఆసిఫోద్దిన్…

జ‌గిత్యాల – లంచం తీసుకుంటూ ఎసిబికి చిక్కారు జగిత్యాల జిల్లా మెట్ పల్లి సబ్ రిజిస్ట్రార్ ఆసిఫోద్దిన్ . ముందుగా వ‌చ్చిన స‌మాచారం మేర‌కు ఈ కార్యాలయంలో ఏసీబీ అధికారులు బుధవారం దాడులు నిర్వహించిన‌ట్లు ఏసీబీ డీఎస్పీ వీవీ రమణమూర్తి తెలిపారు. మెట్ పల్లి పట్టణంలో సాయిరాం కాలనీ లోని 266 గజాల స్థలం ను మార్టిగేజ్ చేయడానికి సబ్ రిజిస్ట్రార్ పదివేలు డిమాండ్ చేశారు స‌బ్ రిజిస్ట్రార్.. ఈ స‌మాచారాన్ని స్థ‌ల య‌జ‌మాని ఎసిబికి స‌మాచారం అందించాడు.. దీంతో మొదటి విడతలో రూ. 5 వేలు లంచం తీసుకుంటుండగా ఎసిబి అధికారులు స‌బ్ రిజిస్ట్రార్ ను పట్టుకున్నారు. అలాగే ఔట్ సోర్సింగ్ అటెండర్ బాణోతు రవి కుమార్, డాక్యుమెంట్ రైటర్ అసిస్టెంట్ ఆర్మూర్ రవిని అదుపులోకి తీసుకున్నామని ఏసీబీ అధికారులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement