తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టీమిండియా క్రికెటర్ మహమ్మద్ సిరాజ్ కలిశారు. టీ20 ప్రపంచ కప్ సాధించినందుకు గాను సిరాజ్‌ను ముఖ్యమంత్రి అభినందించారు. శాలువా కప్పి, పుష్పగుచ్ఛం ఇచ్చారు. ఈ సందర్భంగా టీమిండియా జెర్సీని రేవంత్ రెడ్డికి బహూకరించారు.
ఇక సిరాజ్‌కు హైదరాబాద్‌లో ఇంటిస్థలం, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని సీఎం నిర్ణయించారు. హైదరాబాద్ పరిసరాల్లో స్థలం గుర్తించాలని అధికారులను సీఎం ఆదేశించారు. కార్యక్రమంలో మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నేత అజహరుద్దీన్ పాల్గొన్నారు.
- Advertisement -