Tuesday, January 7, 2025

TG – సివిల్స్ అభ్యర్థులకు సింగరేణి అభయ హస్తం

హైదరాబాద్ఆంధ్రప్రభ,:సివిల్స్‌కు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులను అన్నివిధాలుగా ప్రోత్సహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. దేశంలో అత్యధికంగా తెలంగాణ నుంచి సివిల్స్‌లో ఎంపికవుతారని గర్వంగా చెప్పుకునే స్థాయికి చేరుకోవాలన్నారు. సివిల్స్ మెయిన్స్‌లో ఎంపికైన అభ్యర్థులకు ‘రాజీవ్‌గాంధీ సివిల్స్ అభయ హస్తం’ పేరిట ఆదివారం చెక్కులను పంపిణీ చేశారు. 20 మంది అభ్యర్థులకు ఒకొక్కరికి లక్ష రూపాయల చెక్కును అందజేశారు.

ఆదివారం ప్రజాభవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి ముఖ్య అతిధిగా హాజరయ్యారు.తెలంగాణ వారే ఉండాలి..ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. ఇది ఆర్థిక సాయం కాదని, ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహంగా భావించాలన్నారు. కష్టంతో కమిట్మెంట్ ఉంటేనే విజయం వరిస్తుందన్నారు. ఇంటర్వ్యూకు వెళ్లే ప్రతీ ఒక్కరూ సివిల్స్‌లో సెలెక్ట్ అవ్వాలని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు. ఈ ప్రభుత్వం ఆలోచించేది యువత భవిష్యత్ కోసమే అన్నారు. సివిల్స్‌‌లో తెలంగాణ అభ్యర్థులు ఎక్కువ మంది రాణించాలన్నదే తమ ఉద్దేశమన్నారు.

అడ్డంకులను అధిగమిస్తున్నాం..

ప్రస్తుతం బీహార్ నుంచి అత్యధికంగా సివిల్స్‌లో రాణిస్తున్న విషయాన్ని సీఎం రేవంత్ గుర్తు చేశారు. జాబ్ క్యాలెండర్ ప్రకారం ఉద్యోగాలు భర్తీ చేసేందుకు అన్ని రకాల చర్యలు చేపడుతున్నామని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మొదటి ఏడాదిలో 55,143 ఉద్యోగ నియామకాలు చేపట్టామన్నారు. ఈ విషయంలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. 14 ఏళ్లుగా గ్రూప్-1 పరీక్ష నిర్వహించలేదని, అన్ని అడ్డంకులను అధిగమించి 563 గ్రూప్-1 ఉద్యోగాలకు పరీక్షలు నిర్వహించినట్టు సీఎం చెప్పారు.

- Advertisement -

ఇంటర్వ్యూ సమయంలో ఢిల్లీలో వసతి..మార్చి 31 లోగా ఆయా ఉద్యోగాల నియామకాలను పూర్తి చేయబోతున్నట్లు సీఎం వివరించారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసమే తెలంగాణ సాధించుకున్నామని, పదేళ్లలో ఉద్యోగాల భర్తీ లేకపోవడంతో నిరుద్యోగులు నష్టపోయారన్నారు. అలాంటి పరిస్థితుల్లో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని గుర్తు చేశారు. సివిల్స్ ఇంటర్వ్యూకు ఎంపికైన వారికి ఆర్థిక సాయం అందించడం గర్వకారణమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఇంటర్వ్యూ సమయంలో వారికి ఢిల్లీలో వసతి కల్పిస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ,భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, పలువురు ఎమ్మెల్యేలు, ప్రభుత్వం సీఎస్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement