Sunday, November 24, 2024

TG – బాల‌స‌ద‌న్ లో బాలిక‌పై లైంగిక దాడి …

భ‌వ‌న‌గిరిలో ఘ‌ట‌న‌
ఆల‌స్యంగా వెలుగులోకి
లీగ‌ల్ సెల్ అటెండ‌ర్ వేధింపులు
ఫోక్సో కేసు న‌మోదు

యాదాద్రి భువనగిరి జిల్లాలో దారుణం జరిగింది. భువ‌నగిరి బాలసదన్​లో ఓ అనాథ బాలికపై (10) అత్యాచారానికి ఒడిగట్టాడు జిల్లా లీగల్ సర్వీసెస్ కు చెందిన అటెండర్ . ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ నెల 14న బాలసదన్​ లో జరిగిన కార్యక్రమానికి జిల్లా లీగల్ సర్వీసెస్ (డీసీపీఓ )తో పాటు మరికొందరు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి జిల్లా లీగల్ సర్వీసెస్ విభాగంలో పని చేస్తున్న అటెండర్​ కూడా హాజరయ్యాడు. ఆ సమయంలో ఒంటరిగా ఉన్న బాలికను చూసిన అటెండర్​.. ఆ బాలిక పట్ల లైంగికంగా వేధించాడు..

- Advertisement -

ఈ విషయాన్ని ఏడుస్తూ బాలసదన్​ సిబ్బందికి చెప్పింది బాధిత బాలిక. అయినా గోప్యంగా ఉంచేందుకు దసరా పండగ సందర్భంగా ఆబాలికవలిగొండ మోడల్​ స్కూల్​ కు బాల సదన్​ సిబ్బంది తీసుకొచ్చారు. అనంతరం ఈ విషయం వెలుగులోకి రావడంతో భువనగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై ఫోక్సో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement