Tuesday, November 19, 2024

TG సున్నిత‌ అంశాలపై బాధ్యతతో మాట్లాడండి – సీతక్క

మ‌ల‌క్ పేట – మ‌ల‌క్ పేట లోని ప్ర‌భుత్వ అంద‌బాలిక‌ల హ‌స్ట‌ల్లో బాలిక‌పై లైంగిక దాడి జ‌ర‌గ‌లేదని తాను అసెంబ్లీలో చెప్పిన‌ట్లు జ‌రుగుతున్న ప్ర‌చారాన్ని మంత్రి సీత‌క్క ఖండించారు. ఆ రోజు త‌న‌కు అధికారులిచ్చిన స‌మాచారాన్నిమాత్ర‌మే తాను ప్ర‌స్తావించిన‌ట్లు తెలిపారు. తాను చేసిన మాట‌ల‌ను వ‌క్రీక‌రించ వ‌ద్ద‌ని హిత‌వు ప‌లికారు.

ఇటువంటి సున్నిత‌మైన అంశాల ప‌ట్ల బాద్య‌త‌తో వ్య‌హ‌రించాల‌ని కోరారు. ఈ కేసు విష‌యంలో ప్ర‌భుత్వం పార‌ద‌ర్శ‌కంగా వ్య‌హ‌రిస్తోంది..ఎవ‌రికి ఏలాంటి అనుమానాలు ఉండాల్సిన అవ‌స‌రం లేద‌ని తెలిపారు. ఏవ‌రు కోరినా కేసు పూర్వ ప‌రాలు, పురోగ‌తిని తెలియ చేసేందుకు ప్ర‌భుత్వం సిద్దంగా ఉన్న‌ట్లు మంత్రి తెలిపారు.

- Advertisement -

అంద‌బాలిక లైంగిక దాడి కేసు పురోగతిని సీత‌క్క స‌చివాలయంలో శ‌నివారం నాడు స‌మీక్షించారు. మ‌హిళా శిశు సంక్షేమ శాఖ కార్య‌ద‌ర్శి వాకాటి క‌రుణ‌, హైద‌రాబాద్ క‌లెక్ట‌ర్ అనుదీప్ దురిశెట్టి, విక‌లాంగుల సాధికార సంస్థ డైరెక్ట‌ర్ శైల‌జ‌, ఇన్వేస్టిగేటింగ్ ఆఫీస‌ర్, పోలీస్ అధికారులు, బాలిక‌కు వైద్యం అందించిన డాక్ట‌ర్లు, భ‌రోసా కేంద్ర సిబ్బంది, మాన‌సిక వైద్య నిపుణులు, త్రి స‌భ్య విచార‌ణ క‌మిటీ స‌భ్యుల తో స‌మీక్ష నిర్వ‌హించారు.

కేసు పురోగ‌తిని అడిగి తెలుసుకున్నారు. బాలిక ఆరోగ్య ప‌రిస్థితి మెరుగుప‌డింద‌ని..బాదిత కుటుంబానికి అన్ని ర‌కాల స‌హాయ స‌హ‌కారాలు ఇస్త‌న్న‌ట్లు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. నిందితుడిని ఇప్ప‌టికే అరెస్టు చేసిన‌ట్లు, ద‌ర్యాప్తును వేగ‌వంతం చేస్తున్న‌ట్లు అధికారులు తెలిపారు. విధుల్లో అల‌స‌త్వం వ‌హించిన సిబ్బందిని ఇప్ప‌టికే తొల‌గించిన‌ట్లు చెప్పారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ…కేసు విచార‌ణ త్వ‌రిత గ‌తిన పూర్తి చేసి త‌ప్పు చేసిన వారెంత‌టి వారైనా క‌ఠినంగా శిక్ష‌ప‌డేలా చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని సూచించారు. మ‌హిళ‌ల‌పై అఘాయిత్యాలు, వేదింపులను త‌మ ప్ర‌భుత్వం ఉపేక్షించ‌ద‌ని, క‌ఠినంగా వ్య‌వ‌హిస్తుంద‌ని మంత్రి సీత‌క్క పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement