Saturday, September 21, 2024

TG – ఏచూరి స్ఫూర్తితో జ‌మిలీ ఎన్నిక‌ల‌ను అడ్డుకుంటాం – రేవంత్ రెడ్డి

సీతారాం ఏచూరి సంస్మ‌ర‌ణ స‌భ‌లో రేవంత్ రెడ్డి
న‌మ్మిన సిద్ధాంతం కోసం నిల‌బ‌డిన నేత అత‌ను
బిజెపి జ‌మిలీ పేరుతో కుట్ర‌కు పాల్ప‌డుతోంది
దేశాన్ని క‌బ‌లించేందుకే మోడీ జ‌మిలీ రాగం
ఈ విపత్తు స‌మ‌యంలో ఏచూరి లేక‌పోవ‌డం దుర‌దృష్టం

హైద‌రాబాద్ . కామ్రేడ్ ఏచూరి చూపిన మార్గంలో జమిలి ఎన్నికలను అడ్డుకుంటామ‌ని, పోరాడుతామ‌ని అన్నారు రేవంత్ రెడ్డి. జమిలి ఎన్నికల ముసుగులో దేశాన్ని కబళించాలని బీజేపీ చూస్తున్న స‌మ‌యంలో సీతారాం ఏచూరి మ‌న‌కు దూరం కావ‌డం అంతులేని అవేద‌న‌ను మిగిల్చింద‌న్నారు.. హైదరాబాద్ రవీంద్ర భారతిలో నేడు జ‌రిగిన సీపీఎం జాతీయ కార్యదర్శి కామ్రేడ్ సీతారాం ఏచూరి సంస్మరణ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా సీతారాం ఏచూరిపై రాసిన పుస్తకాన్ని ఆవిష్కరించారు.

- Advertisement -

అనంత‌రం రేవంత్ మాట్లాడుతూ, తాను పీసీసీ అధ్యక్షుడ్ని అయ్యాక రెండు సార్లు కలిశానని తెలిపారు. సీతారాం ఏచూరితో మాట్లాడితే జైపాల్ రెడ్డితో మాట్లాడినట్టు ఉండేదన్నారు. నమ్మిన సిద్ధాంతాల కోసం నిలబడే వారు చాలా అరుదని తెలిపారు. నేను ఈ దేశానికి అంకితం అని చాలా మంది ఉపన్యాసాల్లో చెబుతుంటారు కానీ ఆచరణలో కాదన్నారు. జమిలి ఎన్నికల ముసుగులో దేశాన్ని కబళించాలి అనుకున్నప్పుడు సీతారాం ఏచూరి లేకపోవడం తీరని లోటన్నారు. ఇక రాహుల్ గాంధీకి ఏచూరికి చాలా సన్నిహితంగా ఉంటారన్నారు. యుపిఎ -1,2 ఏర్పాటులో అనేక చట్టాలు తెచ్చినప్పుడు పేదలకు అనుకూలమైన నిర్ణయల్లో ఏచూరి పాత్ర ఎంతో ఉన్న‌ద‌ని అన్నారు రేవంత్ .

జ‌మిలీ ముసుగులో దేశాన్ని క‌బ‌లించే కుట్ర ..

జ‌మిలి ఎన్నికల ముసుగులో అధికారం కాపాడుకోవడానికి బీజేపీ ప్రయత్నాలు చేస్తుందని సంచలన వ్యాఖ్యలు చేశారు రేవంత్.
జమిలి ఎన్నికల ముసుగులో దేశాన్ని కబళించాలని బీజేపీ చూస్తుందని మండిపడ్డారు. రాజ్యాంగ మార్పులు,.. సవరణలు విషయంలో బీజేపీ అవలంబిస్తున్న తీరు చూస్తున్నామన్నారు. యూనియన్ ఆఫ్ స్టేట్స్ స్పిరిట్ ను దెబ్బతీయాలని బీజేపీ చూస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి వ్యతిరేకంగా అందరూ పోరాడాలని రేవంత్ ఈ వేదిక‌పై నుంచి అన్ని పార్టీల‌కు పిలుపు ఇచ్చారు. ఇక రాహుల్ గాంధీ పై కేంద్ర మంత్రి రవణీత్ సింగ్ బిట్టు మాట్లాడిన మాటలపై మోదీ ఇప్ప‌టికీ ఖండించలేదన్నారు. ప్రధాన ప్రతిపక్ష నేతపై అసభ్య భాష మాట్లాడిన మంత్రిపై చర్యలు తీసుకోకపోవడం మోదీ ఫాసిస్ట్ విధానాలకు నిదర్శనం అని రేవంత్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement