Friday, October 18, 2024

TG – ఒక్క మెస్సెజ్ తో స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రిస్తా – దివ్యాంగుల‌కు మంత్రి సీత‌క్క భ‌రోసా

హైద‌రాబాద్ – తెలంగాణ ప్రభుత్వం వికలాంగుల జాబ్ పోర్టల్ ను ఏర్పాటు చేసింది. దివ్వాంగులు ఆఫీసర్లు చుట్టూ తిరిగే పనిలేకుండా నేరుగా జాబ్ పోర్టల్ లో అప్లై చేసుకుంటే చాలని, వారి అర్హతను బట్టి ఉద్యోగం ఉంటుందని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క శుభవార్త చెప్పారు. సచివాలయంలో నేడు జ‌రిగిన ఒక కార్య‌క్ర‌మంలో తెలంగాణ వికలాంగుల జాబ్ పోర్టల్ ను ఆవిష్కరించారు. మహిళా సంక్షేమ శాఖ డైరెక్టరెట్ హెల్ప్ లైన్ లో పదిమందికి అపాయింట్మెంట్ ఆర్డర్లు అందజేశారు.

ఈ సంద‌ర్భంగా సీత‌క్క మాట్లాడుతూ.. ఉపాధి రంగాల్లో దివ్యాంగులకు అవకాశాలు తక్కువ అన్నారు. ఇతర వర్గాల వర్గాల వారిలా ఫైట్ చేయాలంటే ఎన్నో అవరోధాలు ఎదుర్కొవ‌ల‌సి ఉంటుంద‌న్నారు. శారీరకంగా వచ్చే లోపం మన చేతిలో లేదన్నారు. పోషకాహార లోపం, ప్రమాదం వల్ల వికలాంగులుగా మారే ప్రమాదం వుందన్నారు. అందుకే వాళ్లకి ఉపాది అవకాశాలు కల్పించేందుకు ఆన్లైన్ జాబ్ పోర్టల్ ను ప్రారంభిస్తున్నామని తెలిపారు. ప్రైవేటు ఉద్యోగాల్లో వికలాంగులకు రిజర్వేషన్లు పాటించాలని తెలిపారు.

- Advertisement -

రిజ‌ర్వేష‌న్ శాతం పెంచుతాం

ఇక దివ్యాంగులు కంపెనీల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని, ఆన్లైన్ జాబ్ పోర్టల్ లో రిజిస్టర్ చేసుకుంటే చాల‌ని అన్నారు.. వారి అర్హతను బట్టి ఉద్యోగాలు వస్తాయని తెలిపారు. అందుకోసమే పోస్టల్ లో అందుబాటులోకి తెచ్చామన్నారు. సంక్షేమ నిధుల్లో ఐదు శాతం దివ్యాంగులకు కేటాయిస్తున్నామన్నారు. ప్రైవేట్ జాబ్ లో నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించాలని ప్రయత్నిస్తున్నామన్నారు. గతంలో ఒక శాతం ఉంటే దాన్ని నాలుగు శాతానికి పెంచేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు.

ఇందిర‌ర‌మ్మ ఇళ్ల‌లోనూ రిజ‌ర్వేష‌న్
ఇందిరమ్మ ఇండ్లు వంటి సంక్షేమ పథకాల్లో దివ్యాంగులకు రిజర్వేషన్లు పాటిస్తామన్నారు. డిసబిలిటీని దృష్టిలో పెట్టుకొని వారిని ముందుకు తీసుకురావడానికి మా ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి తెలిపారు. సంక్షేమము, విద్యా, ఉద్యోగ రంగంలో దివ్యాంగులకు చేయూతనిచ్చేందుకు ప్రభుత్వం కట్టుబడి వుందన్నారు. దివ్యాంగుల పరికరాల కోసం ఈ ఏడాది బడ్జెట్లో 50 కోట్లు వెచ్చిస్తున్నామన్నారు. దివ్యాంగులు ఆఫీసర్ల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదన్నారు. నేరుగా మాకే..మీ సమస్యలను షేర్ చేయొచ్చని తెలిపారు. మెసేజ్ పాస్ చేస్తే చాలు సమస్యలు పరిష్కరిస్తామన్నారు.

బ్యాక్ లాగ్ పోస్ట్ లు భ‌ర్తీ చేస్తాం..

బ్యాక్ లాగ్ పోస్టులను త్వరలో భర్తీ చేస్తామన్నారు. చాల కాలంగా పెండింగ్ లో ఉన్న బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీ ప్రక్రియ మొదలుపెట్టామన్నారు. అవకాశాలను బట్టి ఏ రంగం మీద మక్కువగా ఉంటే ఆ రంగంలోకి వెళ్ళండి.. పని చేయండి అన్నారు. దివ్యాంగులు స్వయం ఉపాధి కోసం చేయూతనిస్తామని తెలిపారు. వారి శక్తిని బట్టి ఉపాధి అవకాశాలు క‌లిపిస్తామన్నారు.

అనంతరం మహిళా శిశు సంక్షేమ డైరెక్టరేట్ కాల్ సెంటర్లో పదిమంది దివ్యాంగులకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ను మంత్రి సీతక్క అందించారు. ఇక సుహాసిని -హెల్ప్ లైన్ అడ్మినిస్ట్రేటర్ , ఎం లక్ష్మీ -ఐ టి సూపర్వైజర్ , కాల్ ఆపరేటర్లుగా మామిడి లావణ్య , కే లలిత, పార్వతమ్మ , మేడిశ్రీకాంత్, కొన్దోజు నాగలక్ష్మి, ఎం. రజిత, సిహెచ్ సుమిత్ర, అపాయింట్మెంట్ ఆర్డర్లు అందుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement