Home తెలంగాణ‌ TG – బీజేపీలో న‌క్సలైట్లు లేరా? … మంత్రి సీత‌క్క‌

TG – బీజేపీలో న‌క్సలైట్లు లేరా? … మంత్రి సీత‌క్క‌

0
TG  –  బీజేపీలో న‌క్సలైట్లు లేరా? … మంత్రి సీత‌క్క‌

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, హైద‌రాబాద్ : బీజేపీలో న‌క్స‌లైట్ల భావాజాలం ఉన్న వారు లేరా? అని మంత్రి సీత‌క్క ప్ర‌శ్నించారు. ఆదివారం మహబూబాబాద్ లో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో నక్సలైట్ వ్యక్తులు ఉన్నారని అని కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్ర‌శ్నిస్తున్నార‌ని, వాళ్ల పార్టీలో ఉన్న న‌క్స‌లైట్ల గురించి ఏమి చెబుతార‌న్నారు. పశ్చిమబెంగాల్ లో నక్సలైట్ ఉద్యమంలో పనిచేసిన వ్యక్తులకు కూడా ఎంపీ, ఎమ్మెల్యేల టికెట్లు ఇచ్చారు కదా అని బండి సంజయ్ ని నిల‌దీశారు.

ఈటెల రాజేందర్, బుడిగ శోభ తోపాటు మ‌రికొంద‌రు నక్సలిజం భావాజాలం కలిగిన వ్య‌క్తులు అని గుర్తు చేశారు. ఎవ‌రి ద‌యాదాక్షిణ‌లు లేకుండా…తాను నాలుగు సార్లు ములుగు ప్రాంతం నుంచి ఎమ్మెల్యేగా ప్రజల ఆశీస్సులతో గెలుపొందిన‌ట్లు మంత్రి సీత‌క్క అన్నారు. ఎవ‌రి ద‌యాదాక్ష‌ణాల మీద ఆధార‌ప‌డ‌కుండా ప్ర‌జాప్ర‌తినిధిగా ఎన్నిక‌య్యాన‌ని చెప్పారు.

ఇలాంటి మాటలు త‌న‌ను చాలా బాధ కలిగిస్తుందని అన్నారు. ఒకవేళ త‌న‌నే టార్గెట్ గా బండి సంజయ్ మాట్లాడాలి అనుకుంటే త‌న‌ పేరు పెట్టి మాట్లాడాలని సూచించారు.

Exit mobile version