శాలిగౌరారం ఎస్‌ఐ ప్రవీణ్‌ను వీఆర్‌కు అటాచ్ చేస్తూ జిల్లా ఎస్పీ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రవీణ్ తనను వేధిస్తున్నాడంటూ ఓ మహిళ పోలీస్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే..
గతంలో ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆ మహిళ మరోసారి ఎస్పీకి ఫిర్యాదు చేసింది. ఎస్‌ఐ వేధింపుల ఘటన తీవ్ర విమర్శలకు దారి తీసింది.
కేసు విచారణ నిమిత్తం స్టేషన్‌కి పిలిపించి టీ పెట్టించారని.. చికెన్ ఫ్రై, చేపల కూడా వండటం వస్తే బయట కలుద్దామంటూ ఫోన్ చేయడంతో పాటు వాట్సాప్ మెసేజ్ చేశాడంటూ బాధితురాలు ఆరోపిస్తోంది. విచారణ పేరుతో గంటన్నర సేపు తన రూమ్‌లో నిలబెట్టి నానా మాటలు అన్నాడు. ఏదన్నా ఉంటే పర్సనల్‌గా ఫోన్ చేయమన్నాడు. ఇక్కడి విషయాలు ఎవరికన్నా చెప్తే నీతో పాటు కుటుంబానికి ఇబ్బందులు తప్పవని హెచ్చరించాడు. తనపైనే కుల సంఘాల నేతలతో దుష్ర్పచారం చేయిస్తున్నాడు” అంటూ బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది.
దీనిపై జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ విచారణ కు ఆదేశించారు. విచారణ అనంతరం వాసా ప్రవీణ్ కుమార్ ని వీఆర్ కి ఏటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసారు. … ఆయన స్థానంలో నూతన ఎస్ ఐ గా సైదులును నియమించారు.