ఆంధ్ర ప్రభ – హైదరాబాద్ – జాతీయ రహదారుల విస్తరణ, అభివృద్ధిపై ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించనున్నారు. జాతీయ రహదారుల పనులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అవసరమైన చర్యలు చేపట్టే విషయంపై ఈ సమీక్షలో చర్చించనున్నారు..
ఎన్హెచ్ఏఐ ఉన్నతాధికారులు మంగళవారం రోజున ముఖ్యమంత్రిని కలిసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా వారు పలు అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వ సహకారం కావాలని కోరారు. . ఎన్హెచ్-163లో మంచిర్యాల – వరంగల్ – ఖమ్మం – విజయవాడ కారిడార్ నిర్మాణానికి భూములు అప్పగించాల్సి ఉందని ముఖ్యమంత్రికి తెలిపారు.
ఎన్ హెచ్ – 63లో ఆర్మూర్-జగిత్యాల- మంచిర్యాల రహదారికి భూసేకరణ కోసం ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాల్సి ఉందని చెప్పారు. ఇక ఎన్ హెచ్ -563లో.. వరంగల్- కరీంనగర్ రహదారి నిర్మాణానికి చెరువు మట్టి, ప్లైయాష్ కావాలని పేర్కొన్నారు. ఎన్ హెచ్-44తో కాళ్లకల్-గుండ్ల పోచంపల్లి రహదారి… ఆరు వరుసలుగా విస్తరించేందుకు భూసేకరణ చేయాలని … ఖమ్మం- దేవరపల్లి, ఖమ్మం-కోదాడరహదారుల నిర్మాణంలో పోలీస్ భద్రత అవసరం ఉందని ముఖ్యమంత్రికి వివరించారు.
ఆ వినతులపై స్పందించిన సీఎం.. సమస్యల పరిష్కారానికి నేడు ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేశారు.