Saturday, June 29, 2024

TG – కేంద్ర మంత్రి గడ్కరీతో రేవంత్ బృందం భేటి ….. రాష్ర్ట ప్రాజెక్ట్ లపై చ‌ర్చ

కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రితో పాటు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు, రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకట స్వామి, రోడ్లు భవనాల శాఖ కార్యదర్శి హరిచందన, ఇంజనీర్ ఇన్ చీఫ్ గణపతి రెడ్డి, కేంద్ర ఉపరితల రవాణా శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

రాష్ట్ర రహదారులపై సమావేశం సుదీర్ఘంగా కొనసాగింది. రాష్ట్రంలో జాతీయ రహదారులు, ఫ్లై ఓవర్ల నిర్మాణం, రీజినల్‌ రింగ్‌ రోడ్డు సహా పలు అభివృద్ధి ప్రాజెక్టులపై గడ్కరీతో సీఎం బృందం చర్చించింది. ఈ భేటీలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రోడ్ల అభివృద్ధితోపాటు, అంతర్జాతీయ సంస్థల నుంచి రావాల్సిన నిధుల గురించి చర్చించినట్లు సమాచారం. రాష్ట్రంలో ఉన్న రహదారులపై సుధీర్ఘంగా చర్చ జరిగింది.

- Advertisement -

అనంత‌రం ప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ, ఈ స‌మావేశ వివ‌రాల‌ను మీడియాకు తెలిపారు. , తెలంగాణ రాష్ట్రానికి కావాల్సిన రోడ్ల నెట్వర్క్ కావాల్సి అంశాలపై భారత రోడ్డు రవాణా, రహదారుల మంత్రి నితీన్ గడ్కరీకి ప్రెజెంటేషన్ ఇచ్చాన్నారు. . రీజనల్ రింగ్ రోడ్డుపై లోతుగా చర్చించామని, దానిపై వెంట‌నే ప‌నులు చేప‌డ‌తామ‌ని హామీ ఇచ్చిన‌ట్లు చెప్పారు… అలాగే, విజయవాడ- హైదరాబాద్ రోడ్డుకు తొందరగా టెండర్లను పిల్చేందుకు సైతం గడ్కరీ అంగీకరించారు అని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్- కల్వకుర్తి రోడ్లతో పాటు ఇతర రోడ్లపై కూడా సుధీర్ఘంగా చర్చ జరిగిందన్నారు. ఇక, రాష్ట్ర ప్రభుత్వం నుంచి కావాల్సిన అన్ని సహాయక సదుపాయాలు కలిపిస్తామని గడ్కరీకి చెప్పామ‌న్నారు.. వారం రోజుల్లో హైదరాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో లో అన్ని శాఖల అధికారులతో సమావేశం నిర్వహిస్తామ‌ని అంటూ .. అలాగే, తెలంగాణ అభివృద్ధికి సహకరిస్తున్న కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి ధన్యవాదాలు చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement