Tuesday, January 28, 2025

Madyapradesh | ఇండోర్ కు బ‌య‌లుదేరిన రేవంత్ రెడ్డి బృందం..

హైద‌రాబాద్ – ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధ్యప్రదేశ్ లోని ఇండోర్ కు బ‌య‌లుదేరి వెళ్లారు. నేటి ఉదయం 9 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి విమానంలో బ‌య‌లుదేరారు.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు కూడా సీఎంతో పాటు వెళ్లారు.

ఏఐసీసీ ఆధ్వ‌ర్యంలో ఇండోర్ జిల్లా మోవ్‌లో జరిగే జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమం లో పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో రాహుల్ గాంధీ, మ‌ల్లిఖార్జున ఖ‌ర్గేతో స‌హా కాంగ్రెస్ పార్టీకి చెందిన కీల‌క నేత‌లు పాల్గొన‌నున్నారు.. కాగా, మహూ కంటోన్మెంట్ ప్రాంతంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జీవితం, ఆయన రాజ్యాంగ రచనలో చేసిన పాత్రను గుర్తు చేసుకుంటూ ఈ ర్యాలీ జరగనుంది. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. రాజ్యాంగ పరిరక్షణకు, ప్రజాస్వామ్య మూలసిద్ధాంతాల పరిరక్షణకు ప్రభుత్వ ప్రాధాన్యతను మరోసారి చాటిచెప్పనున్నారు. రాజ్యాంగ స్ఫూర్తిని కొనసాగించాల్సిన అవసరాన్ని ఆయన వివరిస్తారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement