Saturday, January 11, 2025

TG – ఉస్మానియా ఆసుప‌త్రికి ఈ నెలాఖ‌రులో శంకుస్థాప‌న‌ – రేవంత్ రెడ్డి

హాస్పిట‌ల్ నిర్మాణంపై రేవంత్ స‌మీక్ష‌
నిర్మాణ న‌మూనాలు పరిశీల‌న‌
ప‌లు మార్పులు, చేర్పులు సూచించిన సిఎం

హైద‌రాబాద్ – ఈ నెలాఖరులోగా ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు వీలుగా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. కొత్త ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణంపై నేడు అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ప్రతిపాదిత స్థలంలో చేపట్టాల్సిన ఉస్మానియా ఆసుపత్రి, ఇతర నిర్మాణాలకు సంబంధించి నమూనా మ్యాప్ లను సీఎంకు వివరించిన అధికారులు. పలు మార్పులు, చేర్పులను రేవంత్ రెడ్డి సూచించారు.

క, రాబోయే 50 ఏళ్ల కాలానికి గాను అవసరాలను అంచనా వేసి కొత్త ఆసుపత్రిని నిర్మించాలని ముఖ్యమంత్రి అన్నారు. ఆసుపత్రికి నలువైపులా రహదారులు ఉండేలని చూడాలన్నారు. చికిత్స కోసం అన్ని జిల్లాల నుంచి ఆసుపత్రికి వచ్చే ప్రజలకు ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా కనెక్టివిటీ రోడ్లను డెవలప్ చేయాలని సూచించారు. రోడ్లు, పార్కింగ్, మార్చురీ, ఇతర మౌలిక సదుపాయాలను రూపొందించాలన్నారు. ఈ నెలాఖరులోగా ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు వీలుగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement