లగ్గచర్ల రైతు ఘటనపై సిఎం ఆరా
రైతులు బేడీలు వేయడం ఏమిటని పోలీస్ అధికారులను నిలదీత
వెంటనే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశం
సమగ్ర నివేదిక అందజేయాలని డిజిపి సూచన
హైదరాబాద్ – లగచర్ల దాడి కేసులో నిందితుడైన రైతు ఈర్యా నాయక్ కు పోలీసులు బేడీలు వేయడం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.. గుండెపోటుతో వచ్చిన రైతును బేడీలతో హాస్పటల్ తీసుకెళ్లడం ఏమిటని పోలీసు ఉన్నతాధికారులను ప్రశ్నించారు.. ఢిల్లీ పర్యటనలో ఉన్నరేవంత్ సంఘటన గురించి తెలిసిన వెంటనే నేరుగా ఫోన్ లో డిజిపితో మాట్లాడారు.. ఇలా ఎందుకు ప్రవర్తించారంటూ ఫైర్ అయ్యారు. సంబంధిత సిబ్బందిపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.. అలాగే ఈ ఘటనపై సమగ్ర నివేదిక ఇవ్వాలని డిజిపిని కోరారు.. గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న రైతుకు మెరుగైన వ్యైద్యం అందించాలని కోరారు.