Friday, October 18, 2024

TG – దేశ రక్షణలో రాజీ లేదు.. సీఎం రేవంత్ రెడ్డి

వికారాబాద్ – దేశ రక్షణ విషయంలో రాజీపడబోమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. దేశ రక్షణ సంస్థలకు హైదరాబాద్ కేంద్రంగా ఉందన్నారు . వికారాబాద్ జిల్లా దామగుం డం అటవీ ప్రాంతంలో వీఎల్ఎఫ్ (వెరీ లో ఫ్రీక్వెన్సీ) నేవీ రాడర్ స్టేషన్ కు కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ తో క‌ల‌సి రేవంత్ నేడు శంకుస్థాపన చేశారు.

ఈ సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి మాట్లాడుతూ, రాడార్ ఏర్పాటు తెలంగాణ రాష్ట్రానికి ఇది మరో ముందడుగన్నారు. డిఫెన్స్ సంస్థలకు వ్యూహాత్మకంగా హైదరాబాద్ సిటీ సేఫ్ ప్లేస్ అన్నారు. దామగుండంపై చాలా మంది వివాదాలు చేయాలని చూశారన్నారు . దామగుండం రాడార్ స్టేషన్ నిర్మాణంతో ఎవరికీ నష్టం లేదన్నారు. తమిళనాడులో34 ఏళ్లుగా రాడార్ స్టేసన్ ఉన్నా ఎలాంటి నష్టం లేదన్నారు. ప్రాజెక్టు ప్రాధాన్యతను తెలంగాణ సమాజం గుర్తించాలన్నారు రేవంత్.

- Advertisement -

దేశ రక్షణ కోసం రాజీపడొద్దనే ప్రాజెక్టుకు అనుమతులు ఇచ్చామన్నారు రేవంత్. దేశ రక్షణ విషయంలో రాజకీయాలు చేయబోమ‌ని, అన్నారు.. ఈ విష‌యంలో కేంద్రంతో కలిసి నడుస్తామన్నారు. దేశ రక్షణ కోసం పెడుతున్న ప్రాజెక్టులపై రాజకీయం చేసేవారు ఆలోచించాలన్నారు. రాడార్ స్టేషన్ నిర్మాణంలో ప్రభుత్వ సహకారం ఉంటుందన్నారు రేవంత్. దేశభద్రత చాలా ముఖ్యమని . రాడార్ స్టేషన్ పై కొందరు లేనిపోని ఆరోపణలు సృష్టిస్తున్నారని విమర్శించారు రేవంత్.

ఈ కార్య‌క్రంలో స్పీకర్ గడ్డం ప్రసాద్, కేంద్రమంత్రులు బండి సంజయ్,కిషన్ రెడ్డి, పలువురు రాష్ట్ర మంత్రులు హాజరయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement